Suryadevara Naga Vamsi: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం !

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం !

Suryadevara Naga Vamsi: టాలీవుడ్‌ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఆయన మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) కన్నుమూశారు. హృదయ సంబంధిత వ్యాధితో ఆమె తుదిశ్వాస విడిచారు.

Suryadevara Naga Vamsi….

కాగా..సూర్యదేవర నాగేంద్రమ్మ (90)కు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు సంతానం. రాధాకృష్ణ రెండో కుమారుడు కాగా.. నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఆమె నాయనమ్మ అవుతారు. శుక్రవారం ఉదయం పది గంటలకు ఫిల్మ్ నగర్‌ లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ఈ శుక్రవారమే రిలీజ్‌ కానుంది. ఈ సమయంలో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

Also Read : Sreeleela : సమంత బాటలో నడుస్తున్న శ్రీలీల

gangs of godavariSuryadevara Naga VamsiSuryadevara Radhakrishna
Comments (0)
Add Comment