Surya-Karthi: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తిలు ఎప్పుడూ ముందుంటారు. తన భార్య జ్యోతిక ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం అందిస్తున్న సూర్య… మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తన సోదరుడు కార్తీతో కలిసి మిగ్‌జాం తుపాను బాధిత ప్రాంతాల్లో ఆహార పంపిణీ కోసం రూ.10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. దీనితో సూర్యతో పాటు కార్తీ అభిమానులు వారిని రియల్ హీరోలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల ఇరులార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు కోటి రూపాయల విరాళం అందించి హీరో సూర్య తన సేవా గుణాన్ని చాటుకోగా… కార్తీ కూడా తాజాగా తన 25వ సినిమా విడుదల సందర్భంగా 25 రోజుల పాటు ప్రతిరోజూ వెయ్యిమందికి అన్నదానం చేయడానికి విరాళమిచ్చారు.
Surya-Karthi – శరవేగంగా సూర్య ‘కంగువా’ షూటింగ్
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువా’. కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ సినిమాలో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు సమాచారం. సూర్య(Suriya) సరసన దిశా పఠానీ నటిస్తుండగా.. బాబీ డియోల్, జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ ఫస్ట్ పార్ట్ ఏప్రిల్‌లో విడుదల కానుంది.
Also Read : Twin Heros: కవల పిల్లలు హీరోలుగా వస్తున్న ‘తికమకతాండ’