Surya Kanguva: విజువల్ ట్రీట్ ఇస్తున్న సూర్య ‘కంగువ’ టీజర్‌ !

విజువల్ ట్రీట్ ఇస్తున్న సూర్య 'కంగువ' టీజర్‌ !

Surya Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా పాన్ ఇండియా సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేదాళం, వివేగం, విశ్వాసం, అన్నాత్తే వంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ శివ (సిరుతై శివ) దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దిశా పఠానీ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో, జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను… ప్రపంచ వ్యాప్తంగా 38 భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర నిర్మాతలు కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ లు మంగళవారం విడుదల చేసారు. త్రీడీలోనూ రూపొందిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘కంగువ’ టీజర్‌… పాన్‌ ఇండియా రేంజ్‌ లో ప్రేక్షకులందరినీ మెప్పించింది. తాజాగా విడుదల చేసిన టీజర్… ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

Surya Kanguva Updates

మంగళవారం విడుదలైన ‘కంగువా’ టీజర్ లో… విజువల్స్‌ తోపాటు యోధుడిగా సూర్య చేసిన వీరోచిత విన్యాసాలు, ఆయన గెటప్పులు టీజర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కంగువ(Kanguva) పాత్రలో సూర్య పోరాట యోధుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. పులితో సూర్య చేసిన ఫైట్ సీక్వెన్స్ స్క్రీన్ మీదే చూడాలని అనిపించేలా ఉంది. హార్స్ ఫైటింగ్, బిగ్ షిప్ వార్ సీన్స్‌ తో వరల్డ్ సినిమా హిస్టరీలోని ఎపిక్ వార్ మూవీస్‌ ను ఈ టీజర్ గుర్తు చేస్తుంది. హై క్వాలిటీ విజువల్స్‌ ను దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఎలివేట్ చేసింది. ఉధిరన్‌ తో కంగువ చేసిన రూత్‌లెస్‌… ఫెరోషియస్ ఫైట్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం హీరో సూర్య పడిన శ్రమంతా ఆయన మేకోవర్, క్యారెక్టర్‌లో కనిపించింది. టీజర్‌ ను చూస్తుంటే సూర్య నట విశ్వరూపం ఏంటో ఇండియన్‌ బాక్సాఫీస్‌ కు చూపెట్టనున్నారని తెలుస్తోంది.

Also Read : Samantha Citadel: సమంత వెబ్ సిరీస్ కు ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ టైటిల్ ఖరారు !

Bobby DeolKanguvaSurya
Comments (0)
Add Comment