Suriya Jyothika: ముంబైకి మకాం మార్చిన జ్యోతిక… అసలు విషయం అదే…

ముంబైకి మకాం మార్చిన జ్యోతిక... అసలు విషయం అదే...

Suriya Jyothika: కోలీవుడ్ లో స్టార్ కపుల్స్ లో అజిత్ కుమార్-షాలినీ, సూర్య-జ్యోతిక, మణిరత్నం-సుహాసిని జంటలు చెప్పుకోదగినవి. ఈ మూడు జంటలు ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు రూమర్స్ రావడం సర్వసాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే సూర్య తన భార్య జ్యోతిక కోసం… తల్లిదండ్రులతో గొడవపడి చెన్నై వదిలి.. ముంబైలో మకాం పెట్టేసినట్లుగా వదంతులు వ్యాపించాయి. అలాంటిదేమీ లేదని పిల్లల చదువు నిమిత్తం ముంబైకి వెళుతున్నట్లుగా.. కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి రూమర్స్ పై పలుమార్లు సూర్య క్లారిటీ ఇచ్చినప్పటికీ… తాజాగా జ్యోతిక అసలు విషయం బయటపెట్టింది. అసలు తాను ముంబైకి ఎందుకు మకాం మార్చాల్సి వచ్చింది అనేది చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చెప్పిన కారణాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Suriya Jyothika Stayed in Mumbai

అత్తమామలను వదిలేసి తన భర్త పిల్లలతో కలిసి ముంబైకు వెళ్లిపోయారంటూ వస్తున్న వార్తలపై జ్యోతిక స్పందించారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రుల సంరక్షణ కోసమే తాత్కాలికంగా తాను ముంబైకు వెళ్లినట్టు జ్యోతిక(Jyothika) చెప్పుకొచ్చారు. ‘‘కరోనా సమయంలో నా తల్లిదండ్రులకు వైరస్‌ సోకింది. ఆ సమయంలో విమాన సేవలు లేకపోవడంతో వారి వద్దకు వెళ్లలేకపోయా. 25 యేళ్లుగా చెన్నైలోనే ఉంటున్నా. నా తల్లిదండ్రులతో కలిసి ఉన్న సమయం చాలా తక్కువ. వివాహం తర్వాత ప్రతి మహిళా తమ తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలను చూసుకోలేక పోతోంది. వివాహం తర్వాత బాధ్యతలు కూడా పెరిగిపోవడంతో వాటిని పక్కనబెట్టి… తల్లిదండ్రులతో గడపలేని పరిస్థితి నెలకొంది. అందుకే కొంతకాలం వారితో ఉండాలన్న ఆలోచనతోనే ముంబైకు వెళ్లాం. ఇది తాత్కాలిక నిర్ణయం. పిల్లలు స్కూల్‌కు వెళ్లేందుకు సులభంగా ఉంది. నా భర్త సూర్య ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారు. నేను, పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు’’ అని జ్యోతిక క్లారిటీ ఇచ్చింది.

దీనితో ఇన్నిరోజుల నుండి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న రూమర్స్ కు జ్యోతిక ఇచ్చిన ఈ సమాధానంతో తెరపడినట్లయింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికైనా ఇటువంటి రూమర్స్ కు చెక్ పడతాయా లేదా అనేది వేచిచూడాలి.

Also Read : Hero Suriya: విద్యార్థి నాయకుడిగా సూర్య ?

JyothikaSuriya
Comments (0)
Add Comment