Suriya: హీరో సూర్యకు షూటింగ్‌ లో స్వల్ప గాయాలు !

హీరో సూర్యకు షూటింగ్‌ లో స్వల్ప గాయాలు !

Suriya: దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో హీరో సూర్య తన 44వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌ లో చిన్న యాక్సిడెంట్ జరిగినట్లుగా నిర్మాత పాండ్యన్ తెలియజేశారు. ఈ యాక్సిడెంట్‌లో హీరో సూర్యకు స్వల్ప గాయం అయిందని, వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించామని నిర్మాత పాండ్యన్ తెలిపారు. ఈ యాక్సిడెంట్‌లో సూర్య తలకు గాయమైనట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

Suriya…

సూర్య44 సినిమా సెట్స్‌లో చిన్న యాక్సిడెంట్ జరిగింది. హీరో సూర్య(Suriya) తలకు చిన్న గాయమైంది. ట్రీట్‌మెంట్ కూడా పూర్తయింది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే మళ్లీ సూర్య యాక్టివ్‌గా షూటింగ్‌లో పాల్గొంటారు.. అని నిర్మాత రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా ఊటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల అండమాన్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని.. మేకర్స్ ఊటీకి షెడ్యూల్ ప్రారంభించారు. ప్రస్తుతం సూర్య సేఫ్‌ గా ఉన్నారని, డాక్టర్స్ ఆయనకు విశ్రాంతి అవసరమని చెప్పినట్లుగా తెలుస్తోంది.

సూర్య44 సినిమా విషయానికి వస్తే… గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో చేతులు కలిపారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య(Suriya), జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సహ నిర్మాతలుగా స్టోన్ బెంచ్ ఫిల్మ్స్‌ రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్, కార్తికేయ సంతానం వ్యవహరిస్తున్నారు. రీసెంట్‌గా సూర్య బర్త్‌డే‌ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇందులో సూర్య బాడ్ యాష్‌ గా కనిపించారు. గ్యాంగ్‌ స్టర్‌ గా అతని స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ థ్రిల్లింగ్ రైడ్‌ కు హామీ ఇచ్చినట్లుగా ఉంది. సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తోన్న ఈ చిత్రంలో జోజు జార్జ్, కరుణాకరన్, జయరామ్ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ మ్యూజిక్, మహ్మద్ షఫీక్ అలీ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా అక్టోబరు 10న విడుదల కానుంది.

Also Read : Ajith Kumar: టాప్ లో ట్రెండ్ అవుతోన్న అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ !

karthik subbarajPooja HegdeRajsekhar Karpoora SundarapandianSuriya
Comments (0)
Add Comment