Suriya Emotional : విజయకాంత్ సమాధి వద్ద కన్నీటి పర్యంతమైన సూర్య

Suriya Emotional : కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ డిసెంబరు 28న చెన్నైలోని మయాత్ ఆసుపత్రిలో కెప్టెన్ కన్నుమూశారు. ఆయన మరణం యావత్ సినీ, రాజకీయ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో నింపింది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు విజయకాంత్ మృతదేహానికి నివాళులర్పించారు. మరికొందరు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేశారు.

Suriya emotional near Vijayakanth’s tomb

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెప్టెన్ కు నివాళులర్పించాడు. షూటింగ్ నిమిత్తం సూర్య విదేశాల్లో ఉన్నప్పటికీ చివరి చూపు కూడా చూడలేకపోయాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన సూర్య విజయకాంత్ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. వారు అతని కోసం ఏడ్చారు. సూర్య(Suriya) రోదిస్తుండగా, ఆయన దగ్గర ఉన్న చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో హాట్ టాపిక్‌గా మారింది.

“విజ‌య‌కాంత్ మృతి దిగ్భ్రాంతి కలిగించింది. నాకంటే సీనియ‌ర్ నాకు అన్నలాంటి వాడు. `పెరియ‌న్న` సినిమాలో తొలిసారిగా స్క్రీన్‌ని పంచుకున్నాం“ , కెప్టెన్‌గా నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. నేను అతనిని చివరిసారి చూడలేకపోవడం దురదృష్టకరం అంటూ సూర్య భావోద్వేగానికి లోనయ్యాడు. మరియు అతని మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. ప్రస్తుతం సూర్య ‘కంగువా’ అనే చారిత్రక చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలను హీరో స్థాయిని పెంచేశాయి.

Also Read : Janhvi Kapoor : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

BreakingEmotionalSuriyaViral
Comments (0)
Add Comment