Suriya: తన ఆరోగ్యం గురించి అభిమానులకు సూర్య ఎమోషనల్ పోస్ట్

తన ఆరోగ్యం గురించి అభిమానులకు సూర్య ఎమోషనల్ పోస్ట్

Suriya: స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కంగువా’ సినిమా షూటింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తూ రోప్ కెమరా పడటంతో సూర్య భుజానికి స్వల్ప గాయాలయ్యాయి. షూటింగ్ ను నిలిపివేసిన చిత్ర యూనిట్ వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తనకు తగిలిన గాయంపై తాజాగా హీరో సూర్య… సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Suriya – ఎక్స్ వేదిగా సూర్య ఎమోషనల్ పోస్ట్

తనకు తగిలిన గాయంపై ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా సూర్య స్పందించారు. ‘నాకు గాయమైందని తెలిసి ఎంతో మంది మెసేజ్‌లు పంపుతున్నారు. మీ అందరి ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ప్రస్తుతం అంతా బాగానే ఉంది’ అంటూ పోస్ట్ పెట్టారు. దీనితో సూర్య అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

పీరియాడికల్ డ్రామాగా ‘కంగువా’

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేదాళం, వివేగం, విశ్వాసం, అన్నాత్తే వంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ శివ (సిరుతై శివ) దర్శకత్వం వహిస్తున్నారు. కంగ అనే పరాక్రముడి కథను పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దిశా పఠానీ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో, జగపతి బాబు, యోగిబాబు, తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆఖరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ లోని కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను థాయిలాండ్‌లోని అడవిలో ఇటీవలే పూర్తి చేసిన చిత్ర బృందం తదుపరి షూటింగ్ ను చెన్నైలో జరుపుకుంటోంది.

Also Read : Vijay Sethupathi: విలన్ పాత్రలకు విజయ్ సేతుపతి నో

KanguvaSuriya
Comments (0)
Add Comment