Surekha Vani : డబ్బుల కోసం కక్కుర్తి పడి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ వచ్చిన 11 మంది యూట్యూబర్స్, ఇన్లూయర్స్ పై ఉక్కుపాదం మోపారు హైదరాబాద్ సిటీ పోలీసులు. ఈ మేరకు వీరందరిపై కేంద్ర సమాచార, ఐటీ నిరోధక చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. కొందరు తమకు ఏమీ తెలియదని అంంటుంటే మరికొందరు తాము చేయక పోయినా ఇంకొందరు వాటిని ప్రమోట్ చేస్తారంటూ బలుపు మాటలు మాట్లాడారు.
Actress Surekha Vani Daughter Supritha Facing Betting Apps Case
ఇదిలా ఉండగా బెట్టింగ్ యాప్స్ దందా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. దీని బారిన పడి వేలాది మంది ప్రభావితం అవుతున్నారు. మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నారు ఆర్టీసీ ఎండీ, సీనియర్ పోలీస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్. దెబ్బకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. యూట్యూబర్లకు షాక్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేసిన వారిలో ప్రముఖ నటి సురేఖా వాణి(Surekha Vani) కూతురు సుప్రిత కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
దీనిపై తీవ్రంగా స్పందించింది సుప్రిత. తనకు ఏ పాపం తెలియదని, తెలియక తాను కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశానని, తాను ప్రస్తుతం సురక్షితంగా ఉన్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తను ప్రస్తుతం రీల్స్, ఇన్ స్టా లో పాపులర్ అయ్యింది. ఇక సినీ ఛాన్స్ కూడా కొట్టేసింది. తను షూటింగ్ లో బిజీగా ఉన్నానంటూ పేర్కొంది.
Also Read : Beauty Tamannaah New Movie : లవర్ తో బ్రేకప్ సినిమాతో ప్యాకప్