Surekha Vani: నటి సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సురేఖావాణి సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నా… ఇన్ స్టాలో మాత్రం కూతురితో రెగ్యులర్ గా దర్శనమిస్తూనే ఉంటుంది. తల్లీకూతుర్లు కలిసి పబ్ లో ఎంజాయ్ మెంట్ విజువల్స్, హాట్ ఫోటో షూట్, హాలీడే ట్రిప్స్, హుక్ డ్యాన్స్ స్టెప్స్ తో సోషల్ మీడియా ఫాలోవర్స్ ను ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు సురేఖావాణి బాలీవుడ్ లో వైరల్ స్టార్ ఓరీతో క్యూట్ పోజులిచ్చి చాలామందిని అవాక్కయ్యేలా చేసింది. బాలీవుడ్ బ్యూటీలు జాన్వీ కపూర్, సారా అలీఖాన్ తో కలిపించే ఈ వైరల్ స్టార్ ఓరీ… ఒక్కసారిగా సురేఖావాణితో క్యూట్ ఫోటోలు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి.
Surekha Vani…
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల విషయానికి వస్తే… ఫొటోలో సురేఖావాణి(Surekha Vani) భుజంపై చేయి వేసి క్లోజ్‌గా ఉన్న వ్యక్తి పేరు ఓరీ. గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలతో కనిపిస్తున్న ఒకేఒక్కడు ఇతడే. అలా అని ఇతడు యాక్టర్ కాదు. ఇతడి చేసే పనెంటో పెద్దగా తెలియదు. కానీ హిందీ హీరోయిన్లకి మాత్రం బెస్టీ. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి హీరోయిన్లతో ఎప్పుడూ అంటిపెట్టుకుని కనిపిస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు తెలుగు నటి సురేఖా వాణితో కనిపించడం ఆసక్తికరంగా మారింది.
అలానే సురేఖావాణి, ఓరీ ఎక్కడ ఎప్పుడు కలిశారనే విషయాలు తెలియదు. హైదరాబాద్ లేదా ముంబయిలో పార్టీలో కలిసినట్లు తెలుస్తోంది. ఎక్కడనేదా సురేఖావాణి చెబితే తప్పితే క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా ఓరీ దగ్గర ఐదుగురు మేనేజర్లు పనిచేస్తున్నారు. ఇతడితో ఫొటో దిగాలంటే లక్షల రూపాయలు చెల్లించాలని ఇతడే ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు సురేఖావాణి కూడా అలానే ఫొటో దిగిందా అనే సందేహం ?
Also Read : Raju Yadav OTT : ఓటీటీకి సిద్ధమవుతున్న జబర్దస్త్ గెట్ అప్ శీను నటించిన ‘రాజు యాదవ్’