Surekha Konidela: రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా సురేఖ అన్నదానం !

రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా సురేఖ అన్నదానం !

Surekha Konidela: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా రెండు రాష్ట్రాల‌లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానులు ఓ రేంజ్‌లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలు అల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించి… ర‌క్త‌దానాలు, అన్న‌దానాలు చేస్తూ రామ్‌ చ‌ర‌ణ్‌పై త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. మరోవైపు రామ్ చరణ్ తల్లి సురేఖ కొణిదెల కూడా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో బాగంగా రామ్ చరణ్ భార్య ఉపాసన ఇటీవల ప్రారంభించిన ‘‘‘అత్తమ్మ కిచెన్‌’ సారథ్యంలో 500 మంది భక్తులకు సురేఖ అన్నదానం చేశారు. చినజీయర్‌ స్వామి ఆశీస్సులతో అపోలో ఆస్పత్రిలోని దేవాలయంలో నిర్వహించిన పుష్కరోత్సవంలో పాల్గొన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం’’ అని ఇన్‌ స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు.

ముందుగా అపోలో ఆస్ప‌త్రిలోని ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయించి అనంత‌రం త‌మ అత్త‌మ్మాస్ కిచెన్ సంస్థ సౌజ‌న్యంతో 500 మందికి పైగా అన్న‌దానం చేశారు. సురేఖ(Surekha Konidela) గారే ద‌గ్గ‌రుండి వంట‌లు చేయించి… అక్క‌డికి వ‌చ్చిన వారికి కోడ‌లు ఉపాస‌న‌, కూతుర్లు, మ‌నుమ‌రాళ్ల‌తో క‌లిసి వ‌డ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మరోవైపు తన పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని రామ్‌ చ‌ర‌ణ్(Ram Charan) త‌న భార్య ఉపాస‌న‌, కూతురు క్లింకార‌, అత్త‌మామ‌ల‌తో క‌లిసి తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శ‌ణం చేసుకున్నారు.

Surekha Konidela – రామ్‌ చరణ్‌ కు సెలబ్రెటీల పుట్టినరోజు శుభాకాంక్షలు !

‘‘ఆస్కార్‌ పురస్కారం పొందిన చిత్రంలో నటించి… గ్లోబల్‌ స్టార్‌ స్థాయికి చేరుకున్న రామ్‌చరణ్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్‌ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్‌ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’’ అంటూ రామ్ చరణ్ బాబాయ్ , పవర్ స్టార్, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఓ ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

‘‘మా గేమ్‌ ఛేంజర్‌ రామ్‌చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. తుపాను మాదిరిగా యాక్షన్‌ కు ముందు నువ్వు నిశ్శబ్దంగా… నిదానంగా ఉంటావు. ఆ తర్వాత మెరుపులు మెరిపిస్తావు. అభిమానుల పట్ల నువ్వు చూపించే ప్రేమ, వినయం ఎప్పటికీ మారదు. (జరగండి పాటను ఉద్దేశించి) నీకు నీ అభిమానులకు నేను ఇచ్చే పుట్టినరోజు కానుక ఇదే’’ అంటూ ప్రముక దర్శకుడు శంకర్‌ శుభాకాంక్షలు తెలియజేసారు.

‘‘హ్యాపీ బర్త్‌ డే చరణ్‌. ప్రేమ, వ్యక్తిత్వాన్ని మీరు మరింత వ్యాప్తి చేయాలని… మరెంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. మరో అద్భుతమైన సంవత్సరాన్ని మాకు అందించాలని ఆశీస్తున్నా. లవ్‌ యూ చరణ్‌’’ అంటూ సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్ చేసారు.

Also Read : Navneet Kaur Rana: లోక్ సభ ఎన్నికల బరిలో యమదొంగ బ్యూటీ !

Konidela Upasanaram charanSurekha Konidela
Comments (0)
Add Comment