Suraj Meher: నిశ్చితార్థం రోజే రోడ్డు ప్రమాదంలో నటుడి దుర్మరణం !

నిశ్చితార్థం రోజే రోడ్డు ప్రమాదంలో నటుడి దుర్మరణం !

Suraj Meher: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌ గఢ్‌ కు చెందిన నటుడు సూరజ్ మెహర్ ( 40) మృతి చెందారు. అర్ధరాత్రి ట్రక్కును కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్‌ గఢ్‌ లోని బిలాస్‌ పూర్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సూరజ్ మెహర్‌ సహచరుడు, డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఒడిశాలో అతనికి నిశ్చితార్థం జరగాల్సి ఉంది.

Suraj Meher No More

శుభకార్యం జరగాల్సిన నటుడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. దీనితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం అర్థరాత్రి తన సినిమా షూటింగ్‌ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూరజ్ మెహర్ ప్రస్తుతం “ఆఖ్రీ ఫైస్లా” అనే చిత్రంలో నటిస్తున్నారు. సూరజ్ ముఖ్యంగా విలన్‌ పాత్రలతో ఫేమస్ అయ్యారు. సూరజ్ మెహర్ బిలాస్‌పూర్‌లోని సరియా గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది.

Also Read : Pushpa 2 : పుష్ప 2 లో 6 నిమిషాల గంగమ్మ జాతరకు అన్ని కోట్ల…!

Road AccidentsSuraj Meher
Comments (0)
Add Comment