Surabhi Lakshmi Shocking :ముద్దు స‌హ‌జం దానికెందుకు అభ్యంత‌రం

మ‌ల‌యాళ న‌టి సుర‌భి ల‌క్ష్మి షాకింగ్ కామెంట్స్

Surabhi Lakshmi : చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ధోర‌ణి మారింది. ప్రేక్ష‌కుల అభిరుచులలో మార్పులు చోటు చేసుకున్నాయి. గ‌తంలో ముద్దు అంటే దూరంగా ఉండే వారు. కానీ ఇప్పుడు ఆ సీన్ ఛేంజ్ అయ్యింది. ఎవ‌ర‌న్నా ఏమ‌న్నా అనుకోని ముద్దుల‌తో సినిమాను నింపేస్తున్నారు. ఇక ఓటీటీల సంగ‌తి గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. వాటికి సెన్సార్ లేక పోవ‌డంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా త‌యారైంది. ఇక గ‌తంలో మూవీస్ లో వ్యాంప్ సాంగ్స్ ఉండేవి. అందు కోసం స్పెష‌ల్ గా న‌టీమ‌ణులు ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్లే వ్యాంప్ పాత్ర‌ల‌లో న‌టిస్తుండడంతో నిర్మాత‌ల‌కు ఆ ప‌ని కూడా త‌ప్పింది.

Surabhi Lakshmi Shocking Comments

తాజాగా లిప్ లాక్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి సుర‌భి ల‌క్ష్మి(Surabhi Lakshmi). ఇదంతా సినిమాలో భాగం అంటోంది. త‌న వ‌య‌సు 38 ఏళ్లు. న‌వంబ‌ర్ 16, 1986లో పుట్టింది. థియేట‌ర్ ఆర్ట్స్ లో మాస్ట‌ర్స్ చేసింది. 2005 సంవ‌త్స‌రంలో సినిమా రంగంలోకి ప్ర‌వేశించింది. భ‌ర్త విపిన్ సుధాక‌ర్. ఉత్త‌మ న‌టిగా అవార్డు పొందింది 2016లో. మూవీస్ లోనే కాదు టెలివిజ‌న్ లో కూడా పేరు పొందారు. మ‌ల‌యాళ చిత్రం మిన్న‌మినుంగు లో త‌ల్లి పాత్ర‌ను అద్భుతంగా పోషించినందుకు గాను ఉత్తమ న‌టి పుర‌స్కారం ద‌క్కింది. ఆమెలోని న‌ట‌న‌ను అంద‌రూ అభినందించారు.

అంతే కాకుండా మీడియా వ‌న్ టీవీలో మ‌ల‌యాళ హాస్య సీరీస్ ఎం80 మూసా ద్వారా పాతు పాత్ర‌తో మ‌రింత ప్ర‌సిద్ది చెందింది. జ‌నానికి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యింది. ఆమె శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయంలో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో పి.హెచ్.డి పూర్తి చేసింది. అమృత టీవీలో రియాల్టీ షో బెస్ట్ యాక్ట‌ర్ గా గెలుపొందింది. 64వ జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌లో ఉత్త‌మ న‌టిగా సుర‌భి ల‌క్ష్మి(Surabhi Lakshmi) అందుకుంది. 20కి పైగా మ‌ల‌యాళ చిత్రాల‌లో న‌టించింది. త‌ను ముద్దు పెట్టుకునేందుకు అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. త‌న స‌హ న‌టుడికి సిగ‌రేట్ తాగే అల‌వాటు ఉంద‌ని, దీంతో బ్ర‌ష్ చేసుకుని రావాల‌ని చెప్పాన‌ని తెలిపింది. సుర‌భి ల‌క్ష్మి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Hero Ram Charan-RC16 :ఆర్సీ16 గ్లింప్స్ బ‌ర్త్ డే స్పెష‌ల్ గిఫ్ట్

CommentsShockingSurabhi LakshmiViral
Comments (0)
Add Comment