Sundeep Kishan : పేద మహిళల సహాయార్థం ముందుకు వచ్చిన హీరో సందీప్ కిషన్

తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు సందీప్ కిషన్....

Sundeep Kishan : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోలో హీరోగా మెప్పిస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇటీవల ధనుష్ తో కలిసి అతను నటించిన రాయన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో సందీప్ కిషన్ నటనకు ప్రశంసలు వచ్చాయి. సినిమాల సంగతి పక్కన పెడితే సందీప్ కిషన్ కు సామాజిక స్పృహ ఎక్కువ. కష్టాల్లో ఉన్నవారికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తుంటాడు.

ఇందులో భాగంగా తాను నిర్వహిస్తోన్న వివాహ భోజనంబు రెస్టారెంట్ల నుంచి ప్రతిరోజు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నాడు సందీప్ కిషన్(Sundeep Kishan). ముఖ్యంగా ఆశ్రమాలతో పాటు రోడ్‌ సైడ్‌ ఉండే పేదలకు తన రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నాడీ హ్యాండ్స్ హీరో. ఇందుకు గానూ నెలకు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సందీప్‌ ఇటీవలే చెప్పుకొచ్చాడు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు సందీప్ కిషన్.

Sundeep Kishan Helps..

యాక్సిడెంట్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు వైద్య ఖర్చుల కోసం రూ. 50 వేలు సాయం చేశాడు హీరో సందీప్ కిషన్(Sundeep Kishan). సోషల్ మీడియాలో వచ్చిన రిక్వెస్ట్ మేరకుస్పందించిన అతను వెంటనే డబ్బును సదరు మహిళ కు అందజేశాడు. ‘ యాక్సిడెంట్ కారణంగా మహిళ మెదడులో బ్లీడింగ్ అవుతుందని, రోజుకు దాదాపు రూ. 60 వేల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని, మీ సాయం కావాలి’ అని కోరుతూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. దీంతో చెలించిపోయిన సందీప్ కిషన్ వెంటనే సదరు మహిళకు రూ. 50 వేల ఆర్థిక సాయం చేశాడు.అంతేకాదు తాను సాయం చేశానని, మీరు కూడా ఎంతో కొంత చేయాలని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు సందీప్ కిషన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read : AAY Movie Team : వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ‘ఆయ్’ టీమ్

HelpingSundeep KishanUpdatesViral
Comments (0)
Add Comment