Sumaya Reddy Shocking :మాట్లాడితేనే సంబంధం అంట‌గ‌డితే ఎలా..? 

వాపోయిన న‌టి..నిర్మాత సుమ‌యా రెడ్డి 

Sumaya Reddy : డియ‌ర్ ఉమ సినిమా నిర్మాత‌, ర‌చ‌యిత్రి, న‌టి  సుమ‌యా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా త‌న గురించి లేనిపోని కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది. కేవ‌లం మాట్లాడినంత మాత్రాన సంబంధం ఉందంటూ ఎలా చెబుతారంటూ ప్ర‌శ్నించింది. మీరు ఏమైనా క‌లిసి ఉన్న‌ప్పుడు చూశారా అంటూ నిల‌దీసింది. ఒక మ‌హిళ ప‌ట్ల ఇలాగేనా వ్య‌వ‌హ‌రిస్తారా అని  ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌న గురించి చుల‌క‌న‌గా మాట్లాడే వాళ్ల‌కు తోబుట్టువులు లేరా, మ‌హిళ‌లు మీ ఇళ్ల‌ల్లో లేరా అని ఫైర్ అయ్యింది సుమ‌యా రెడ్డి.

Sumaya Reddy Shocking Comments

తాజాగా త‌ను ట్రోల్ కు గురైంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది ఒకే ఒక్క సీన్ తో. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డితో ఎయిర్ పోర్ట్ లో సుమ‌యా రెడ్డి(Sumaya Reddy) క‌లిసింది. ఈ సంద‌ర్భంగా ఆమె భుజంపై త‌ను చేయి వేసి ఉన్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్య‌మాల‌లో క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యాయి. దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో స్పందించాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది న‌టి, నిర్మాత‌. త‌ను పేరు పొందిన మోడ‌ల్ కూడా. త‌న స్వ‌స్థ‌లం రాయ‌ల‌సీమ‌కు చెందిన అనంత‌పురం.

అంతే కాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిర్వ‌హించిన మిస్ ఆంధ్రా పోటీల్లో కూడా త‌ను పాల్గొంది. మిస్ ఆంధ్రాగా విజేత‌గా నిలిచింది సుమ‌యా రెడ్డి. దీంతో త‌న‌కు వ‌రుస‌గా సినిమాల‌లో ఛాన్స్ లు కూడా వ‌చ్చాయి. డియ‌ర్ ఉమ చిత్రాన్ని నిర్మించ‌డ‌మే కాకుండా క‌థ స‌హ‌కారంతో పాటు న‌టించింది హీరోయిన్ గా. ఇంకో వైపు ఈ రెండు మ‌న‌సులు మూవీలో న‌టిస్తుండ‌గా..త‌మిళంలో ఇంకో సినిమాకు సైన్ చేయ‌డం విశేషం. ఇక తోపుదుర్తి వివాదంపై క్లారిటీ ఇచ్చింది. త‌మ కుటుంబాల మ‌ధ్య సంబంధాలు ఉన్నాయ‌ని , ఊరికే క‌లిశామ‌ని తెలిపింది సుమ‌యా రెడ్డి.

Also Read : Hero Akhil Akkineni :అఖిల్ అక్కినేని మూవీ టైటిల్ ఫిక్స్

CommentsShockingSumaya ReddyViral
Comments (0)
Add Comment