Sudheer : రష్మీతో పెళ్లిపై సుధీర్ క్లారిటీ?

రష్మీతో పెళ్లి.. సుధీర్ రియాక్షన్ ఇదే!

Sudheer : రష్మీ సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరలో ఈ జంట అంటే చాలా మందికి ఇష్టం .ఇక వీరికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి.ముఖ్యంగా వీరు ప్రేమలో పడ్డారు, త్వరలో పెళ్లి చేపుకోబోతున్నారు అంటూ చాలా వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతాయి.

ఇక సుధీర్ జబర్ధస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించి, ప్రస్తుతం పలు సినిమాలలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అరుణ్ విక్కిరాల దర్శకత్వంలో వస్తున్న సహస్ర సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తూ, ఈవెంట్లో పలు రకాల ప్రశ్నలు సుధీర్ సమాధానాలు ఇచ్చాడు.

Sudheer :

యాంకర్ రష్మీతో పెళ్లి అని రూమర్స్ వస్తున్నాయిగా, దానిపై మీరేమంటారు అని అడగ్గా..రష్మీ , సుదీర్(Sudheer)ని జనం ఇంతగా ఆదరించినందుకు వారందరికీ థాంక్స్. రష్మీ, నేను మంచి స్నేహితులం కానీ నేను బయటకు వెళ్లిన ప్రతీ సారి రష్మీతో నీ రిలేషన్ షిప్ ఎలాంటిది అని చాలా మంది అడుగుతారు అన్నారు. కానీ రష్మితో కెమిస్ట్రీ వగేరా అంతా కూడా కేవలం ఆన్ స్క్రీన్ కోసమే చేసింది. ఇక పెళ్లి అంటారా అది నా చేతులలో లేదు.. ప్రస్తుతానికి తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందంటూ పెళ్లి గురించి అసలు ఆలోచన లేదంటూ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాను ఒకవేళ దేవుడు తనని పెళ్లి వైపుగా తీసుకువెళ్తే చూస్తానని తెలిపారు.

Also Read : Oppenheimer: ఓటీటీలోకి ‘ఓపెన్‌హైమర్‌’… కాకపోతే కండిషన్స్‌ అప్లయ్‌..!

marriagerashmiSudheer
Comments (0)
Add Comment