Maa Nanna Super Hero : సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా వైరల్ అవుతున్న సాంగ్

సంగీత దర్శకుడు జైక్రిష్ నాన్నపై అద్భుతమైన నెంబర్‌ని స్కోర్ చేశారు...

Maa Nanna Super Hero : నవ దళపతి సుధీర్ బాబు అప్ కమింగ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. ఇందులో సుధీర్ బాబు(Sudheer Babu) ఎమోషనల్ ప్యాక్డ్ రోల్‌లో కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సినిమాపై స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగా.. తాజాగా మేకర్స్ ‘నాన్న సాంగ్’ని రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

ఈ నాన్న సాంగ్ విషయానికి వస్తే.. ప్రతి కొడుకు తన తండ్రికి హార్ట్ ఫుల్‌గా రాసే ప్రేమ లేఖ లాంటి అనుభవాన్ని ఇచ్చే ఈ సాంగ్‌లో.. కొడుకు తన తండ్రి పట్ల ఉన్న ప్రేమ, అభిమానాన్ని ఎంతో గొప్పగా తెలియజేస్తున్నాడు. తన తండ్రి తనను పూర్తిగా నెగ్లెట్ చేసినప్పటికీ, అతనితో సమయం గడపడాన్ని కొడుకు ఆనందపడతాడు. పెళ్లి భోజన సమయంలో సుధీర్ బాబుకి తన తండ్రి నీళ్ళు అందజేస్తూ, తన అభిమానాన్ని చూపించడం ఈ సాంగ్‌లో హైలెట్ మూమెంట్‌ అని చెప్పుకోవచ్చు. హార్ట్ టచ్చింగ్‌గా ఈ సాంగ్‌ని పిక్చరైజ్ చేశారు.

Maa Nanna Super Hero Movie Updates

సంగీత దర్శకుడు జైక్రిష్ నాన్నపై అద్భుతమైన నెంబర్‌ని స్కోర్ చేశారు. లక్ష్మీ ప్రియాంక లిరిక్స్ భావోద్వేగాలను ఇంటెన్స్‌గా ప్రజెంట్ చేయగా.. నజీరుద్దీన్ వోకల్స్ డెప్త్‌ని యాడ్ చేశాయి. రాజు సుందరం ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. సుధీర్ బాబు ఇందులో చాలా కూల్‌గా కనిపించగా.. షాయాజీ షిండే ఎరోగెంట్ ఫాదర్‌గా తన నేచర్ చూపించారు. నాన్న సాంగ్ విజువల్స్ హత్తుకునేలా ఉన్నాయి, ఈ సాంగ్ తండ్రి కొడుకు బాండింగ్‌కి మెమరబుల్ ట్రిబ్యూట్ అని చెప్పుకోవచ్చు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : Tripti Dimri : తన కెరీర్ మొదటిలో పడ్డ ఇబ్బందులను పంచుకున్న త్రిప్తి

CinemaSudheer BabuTrendingUpdatesViral
Comments (0)
Add Comment