Sudheer Babu: జూన్ 4 చంద్రబాబుకు, 14 నాకు కలిసొస్తుంటున్న సుధీర్ బాబు !

జూన్ 4 చంద్రబాబుకు, 14 నాకు కలిసొస్తుంటున్న సుధీర్ బాబు !

Sudheer Babu: యంగ్ హీరో సుధీర్ బాబు, మాళవిక శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘హరోం హర’. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్‌ జి.నాయుడు గ్రాండ్‌ గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌ కి ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సునీల్‌ ముఖ్య పాత్ర పోషించగా… చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో యంగ్ హీరోలు విష్వక్‌ సేన్, అడివి శేష్, దర్శకుడు మారుతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Sudheer Babu…

ఈ వేడుకలో భాగంగా హీరో మహేశ్‌ బాబు ఆడియో ద్వారా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ… ట్రైలర్‌ చాలా ఆసక్తిగా ఉంది. సుధీర్‌ బాబు(Sudheer Babu) చాలా కొత్తగా కనిపించారు. ఇలాంటి నేపథ్యమున్న చిత్రాల్నే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ ప్రాజెక్టు పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు. ‘మా నాన్న తొలిసారి నా సినిమాకి సంబంధించిన వేడుకకు రావడం ఆనందంగా ఉంది. మా మావయ్య కృష్ణ నా హీరో. ఈ సినిమా ఆయన కోరుకున్నదే. ఆయన నన్ను ఎలాంటి పాత్రలో చూడాలని కోరుకున్నారో, అలాంటిదే ఈ సినిమా అని చాలా గర్వంగా చెబుతున్నాను. జూన్‌ 4 ఎన్నికల ఫలితాలొచ్చాయి. కుప్పం నుంచి చంద్రబాబు గెలిచారు. జూన్‌ 14న సుబ్రహ్మణ్యం వస్తున్నాడు. వాడూ గెలుస్తాడు’’ అని సుధీర్‌బాబు అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు జ్ఞానసాగర్‌ మాట్లాడుతూ… ‘‘హరోం హర’ పక్కాగా గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నారు. నిర్మాత సుమంత్‌ మాట్లాడుతూ..‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడి పనిచేశాం. ఆ కష్టానికి ప్రతిఫలం శుక్రవారం అందుతుందని నమ్మకంగా ఉంద’న్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, శశిధర్‌ రెడ్డి, దామోదర్‌ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్‌ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.

Also Read : Love Me: త్వరలో ఓటీటీలోనికి వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ ‘లవ్ మీ’ !

Harom HaraSudheer Babu
Comments (0)
Add Comment