Sudheer Babu: త్వరలో సెట్స్ పైకి సుధీర్‌ బాబు ‘జటాధర’ !

త్వరలో సెట్స్ పైకి సుధీర్‌ బాబు ‘జటాధర’ !

Sudheer Babu: వెంకట్‌ కల్యాణ్‌ దర్శకత్వంలో సుధీర్‌ బాబు హీరోగా రూపొందనున్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘జటాధర’. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌ బాబు(Sudheer Babu) ప్రొడక్షన్‌ బ్యానర్‌పై శివివన్‌ నారంగ్, నిఖిల్‌ నంద, ఉజ్వల్‌ ఆనంద్‌ నిర్మించనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో సుధీర్ బాబు సరసన ప్రముఖ బాలీవుడ్ తార నటించనుంది. ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో మరో బాలీవుడ్ నాయకిని కూడా రంగంలోనికి దించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపధ్యంలో ‘జటాధర’ సెకండ్‌ పోస్టర్‌ విడుదల చేసింది చిత్ర యూనిట్.

Sudheer Babu Movie Updates

ఈ సందర్భంగా హీరో సుధీర్‌ బాబు మాట్లాడుతూ… ‘‘జటాధర’ కథ శాస్త్రీయత, పౌరాణిక అంశాల కలయికలో ఉంటుంది. ఈ రెండు ప్రపంచాలను ప్రేక్షకులు వెండితెరపై చూస్తున్నప్పుడు ఓ సరికొత్త అనుభూతిని అందుతారు. ప్రేరణ అరోరాగారితో కలిసి ఈ సినిమా కోసం ప్రయాణం చేయటం గొప్ప అనుభూతి. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉంటాయి’’ అని తెలిపారు.

‘‘జటాధర’ సినిమా ప్రీప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తాం. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ బాలీవుడ్‌ స్టార్‌ నటించనున్నారు. అలాగే ప్రతినాయకిపాత్రలో మరో బాలీవుడ్‌ నటి నటిస్తారు. 2025 శివరాత్రికిపాన్‌ ఇండియా ప్రేక్షకులను ఈ మూవీ అలరించనుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Also Read : P Susheela: ప్రముఖ గాయని సుశీలకు కలైజ్ఞర్‌ స్మారక అవార్డు !

JatadharaMaa Nanna SuperheroSudheer Babu
Comments (0)
Add Comment