SSMB29 : పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కీలక అప్ డేట్ ఇచ్చాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు మూవీకి సంబంధించి అద్బుతమైన పోస్టర్ ను శనివారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇప్పటికే ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సింహాన్ని లాక్ చేస్తూ ఉన్న ఈ పిక్చర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు(Mahesh Babu) సింహం లాంటోడని, ఇక షూటింగ్ కోసం తాను లాక్ చేశానంటూ పేర్కొన్నారు.
SSMB29 Movie Shooting Updates
ఇంకా పేరు నిర్ణయించని ఈ మూవీ పూర్తిగా కౌబాయ్, అడ్వెంచర్ నేపథ్యంలో ఉండనుందని ఇప్పటికే టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. దీనికి ఎప్పటి లాగే రాజమౌళి తండ్రి, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ కథ అందించాడు. గతంలో కౌబాయ్ అన్నా, ఈస్ట్ మన్ కలర్ సినిమాలన్నా ముందుగా గుర్తుకు వచ్చేది పద్మాలయ స్టూడియోనే. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణనే.
సుదీర్ఘ కాలం తర్వాత ఎస్ఎస్ రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. తను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజతో తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డుల మోత మోగించింది. ఇది ఆస్కార్ అవార్డును కూడా స్వంతం చేసుకుంది.
ఆ తర్వాత ప్రిన్స్ తో వస్తున్న భారీ చిత్రం కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరల్డ్ వైడ్ మార్కెట్ స్టార్ట్ అయ్యింది. ఇందులో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటిస్తుండడం విశేషం. మొత్తంగా రాజమౌళినా మజాకా అంటున్నారు సినీ ప్రేమికులు.
Also Read : Hero Balayya Akhanda 2 : బాలయ్య చిత్రం మలయాళ సోయగం