SSMB29 Movie : మహేష్ బాబు, జక్కన్న సినిమా నుంచి కీలక అప్డేట్

ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు...

SSMB29 : రాముడిగా సంచలన దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమాలో సూపర్ స్టార్ మ‌హేష్‌ బాబు కనిపించబోతున్నట్లుగా టాక్ వినబడుతోంది. మ‌హేష్ బాబు(Mahesh Babu) – రాజ‌మౌళి కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా క‌థ‌కీ, రామాయ‌ణానికీ ప‌రోక్షంగా ఓ లింక్ ఉంద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఓ సంద‌ర్భంలో మ‌హేష్ రాముడి అవ‌తారంలో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. వార‌ణాసిలో ఈ కీల‌క స‌న్నివేశాల చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది‌. ఇక ఎప్పుడైతే రాముడిగా మహేష్ బాబు కనిపించబోతున్నాడనేలా వార్త బయటికి వచ్చిందో.. ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఎవరికి నచ్చిన విధంగా వారు మహేష్ బాబును రాముని అవతారంలో రెడీ చేసి ఫొటోలు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా రాముని అవతారంలో ఉన్న మహేష్ బాబు ఏఐ ఇమేజెస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

SSMB29 Movie Updates

సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ఇటీవల ఓ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.సోషల్‌ మీడియా వేదికగా ఎడారి ప్రాంతంలో తిరుగుతున్న ఫొటో షేర్‌ చేసి ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అని క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఆయన మహేశ్‌ సినిమా కోసం లొకేషన్స్‌ సెర్చ్‌ చేస్తున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే అప్‌డేట్‌ ఇవ్వాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ చిత్రంలో జంతువులు ఎక్కువగా కనిపిస్తాయి అని ఇటీవల జక్కన్న హింట్‌ ఇచ్చారు. ఆయన పోస్ట్‌ చేసిన ఫొటోలో జంతువుల గుంపు కనిపిస్తోంది. ఆ ఫొటో నెట్టింట వైరల్‌ అయిన విషయం తెలిసిందే.కనీసం ఇలాగైనా అప్‌డేట్‌ ఇచ్చారంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం చిత్రబృందం దృష్టి అంతా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులపైనే ఉంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోందని టాక్‌. ఈ ప్రాజెక్ట్‌ కోసం రాజమౌళి ఏఐ టెక్నాలజీని వినియోగించనున్నట్లు కూడా ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ మూవీలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారని, భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారని తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమౌళి ఇంతకు ముందు చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్‌ని రాముడిగా చూపించిన విషయం తెలిసిందే.

Also Read : Laapataa Ladies : ఆస్కార్ బరిలో ఉన్న ‘లపతా లేడీస్’ సినిమాకు మరో ట్విస్ట్

CinemaMahesh BabuSS RajamouliSSMB29TrendingUpdatesViral
Comments (0)
Add Comment