Popular Director Rajamouli-SSMB29 :హాలీవుడ్ రేంజ్ లో జ‌క్క‌న్న మూవీ

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా తెర‌కెక్కుతోంది

SSMB29 : ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ29. జ‌క్క‌న్న ఏది చేసినా అది పెను సంచ‌ల‌నం. దేశ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. బాహుబ‌లి మూవీతో రికార్డ్ బ్రేక్ చేసిన రాజ‌మౌళి(Rajamouli) ఆ త‌ర్వాత బాహుబ‌లి సీక్వెల్ తో దుమ్ము రేపాడు. అనంత‌రం రుధిరం రౌద్రం ర‌ణం పేరుతో తీసిన మూవీ చ‌రిత్ర సృష్టించింది. ఏకంగా యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచేలా చేసింది. ఏకంగా ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకుంది.

SSMB29 Movie Updates

నాటు నాటు సాంగ్ కు ఉత్త‌మ లిరిక్ గా పుర‌స్కారం ద‌క్కింది. స్వ‌ర క‌ల్ప‌న‌కు గాను ఎంఎం కీర‌వాణి , రాసినందుకు గాను చంద్ర‌బోస్ కు ఈ అరుదైన అవార్డును స్వంతం చేసుకుని అంద‌రినీ విస్తు పోయేలా చేసింది.ప్ర‌స్తుతం తాజా చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు ఎస్ఎస్ రాజ‌మౌళి. దీనిని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా హాలీవుడ్ రేంజ్ లో తీయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌యింది. రెండో షెడ్యూల్ ఒడిశా అడ‌వుల్లో చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేశాడు జ‌క్క‌న్న‌.

ఇందులో ప్రిన్స్ మ‌హేష్ బాబు, బాలావుడ్, హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాతో పాటు మ‌ల‌యాళ సినీ న‌టుడు పృత్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కానేలేదు. ఇప్ప‌టికే ఎస్ఎస్ఎంబీ29 కోసం పోటీ నెల‌కొంది. ప్ర‌పంచ మార్కెట్ లో భారీ పోటీ నెల‌కొంది. ఈ సినిమాకు సంబంధించి ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ చేయాల‌ని సంక‌ల్పించాడు జ‌క్క‌న్న‌. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు కూడా పూర్తి చేసిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : Jyothika Shocking Comment :కంగువ మూవీపై జ్యోతిక కామెంట్స్ 

CinemaMahesh BabuS S RajamouliSSMB29TrendingUpdates
Comments (0)
Add Comment