SSMB29 : దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఎస్ఎస్ఎంబీ29 చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో ప్రిన్స్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ కోసం ప్లాన్ చేశాడు డైరెక్టర్. విజయేంద్ర ప్రసాద్ దీనికి కథ రాశారు. ఈ చిత్రం పూర్తిగా అడ్వెంచరస్ గా ఉండబోతోందని ఇప్పటికే ప్రకటించారు. ఇక సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా సినిమా పూర్తి కాకుండానే ఫుల్ డిమాండ్ పెరిగింది.
SSMB29 Movie Photos Viral
ఎస్ఎస్ఎంబీ29 పై పూర్తి దృష్టి సారించాడు ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh Babu). ఇప్పటికే తనను లాక్ చేశాడు దర్శకుడు రాజమౌళి. అయితే సినిమాకు సంబంధించి షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎవరు పాల్గొంటున్నారనే దాని గురించి ఎక్కడా వార్తలు బయటకు రావడం లేదు. సినిమా కన్ ఫర్మ్ చేసేకంటే ముందే ఇందులో నటిస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరూ కూడా చిత్రానికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయటకు రివీల్ చేయబోమంటూ ఒప్పందం కూడా చేసుకున్నట్లు సమాచారం.
అందులో భాగంగానే ఈ న్యూ మూవీ గురించి విశేషాలు బయటకు రావడం లేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు కొన్ని సీన్స్ అల్యూమీనియం పరిశ్రమలో చిత్రీకరించారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. డియోమాలి, తలమాలి, కాళ్యమాలి అటవీ ప్రాంతాల్లో 23 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కోలాబ్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా ఒడిషా హోటల్ లో దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Also Read : Hero Siddu Jonnalagadda :జొన్నలగడ్డ జాక్ కొంచెం క్రాక్ బాస్