Hero Mahesh-SSMB29 : మ‌హేష్ బాబు నెట్టింట్లో వైర‌ల్

ఎస్ఎస్ఎంబీ 29 పోస్ట‌ర్ సంచ‌ల‌నం

Hero Mahesh : టాలీవుడ్ ను షేక్ చేస్తోంది ఎస్ఎస్ఎంబీ 29 పోస్ట‌ర్. ఎక్స్ వేదిక‌గా కీల‌క అప్ డేట్ ఇచ్చాడు దర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న‌. పూర్తిగా అడ్వెంచ‌ర్ నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో కీల‌క‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు ప్రిన్స్ మ‌హేష్ బాబు(Hero Mahesh), ప్రియాంక చోప్రా. షేర్ చేసిన పిక్చ‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Hero Mahesh SSMB29 Movie Updates

ఆస్కార్ అవార్డుతో యావ‌త్ ప్ర‌పంచ సినిమా త‌న వైపు తిప్పుకునేలా చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కావ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఇక ఏ పాత్ర‌లోనైనా ఇమిడి పోవ‌డమే కాదు వంద శాతం త‌న ఎఫ‌ర్ట్ పెట్టే అరుదైన న‌టుడు అందగాడు మ‌హేష్ బాబు ఇందులో కౌబాయ్ గా న‌టిస్తుండ‌డంతో ఇంట‌ర్నేష‌న‌ల్ సినీ మార్కెట్ సైతం రాబోయే చిత్రంపై ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది.

ఇప్పికే బాహు బ‌లి, బాహు బ‌లి 2, ఆర్ఆర్ఆర్ , ఆర్ఆర్ఆర్ 2 తో రికార్డుల మోత మోగించాడు జ‌క్క‌న్న‌. కోట్ల వ‌ర్షం కురిపించాడు. మిగ‌తా డైరెక్ట‌ర్లు అందుకోని స్టార్ డ‌మ్ ను స్వంతం చేసుకున్నాడు . త‌ను ఏది చేసినా దాని వెనుక అద్భుత‌మైన ప్ర‌యోగం ఉంటుంద‌ని టాక్. దీనినే కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాడు. ఈ త‌రుణంలో సింహంతో పాటు మ‌హేష్ బాబు ఉన్న ఫోటోను పంచుకోవ‌డం, అది భారీగా ఆద‌రణ పొంద‌డం విస్తు పోయేలా చేసింది సినీ వ‌ర్గాల‌ను.

ఇంకా షూటింగ్ మొద‌లు కాకుండానే రికార్డుల‌ను తిర‌గ రాసేందుకు రెడీ అయ్యింది ఎస్ఎస్ఎంబీ29. ఎంతైనా జ‌క్క‌న్నా మ‌జాకా అంటున్నారు సినీ జ‌నం.

Also Read : Super Star-SSMB29 : జ‌క్క‌న్న ప్రిన్స్ మూవీ షూటింగ్ షురూ

Comments (0)
Add Comment