SS Thaman Shocking Comment :డీఎస్పీని తీసుకోవ‌డంపై థ‌మ‌న్ కామెంట్స్

పుష్ప‌2కి మొద‌ట త‌న‌నే అనుకున్నారు

SS Thaman : బహు భాష‌ల్లో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లుగా గుర్తింపు పొందారు ఎస్ఎస్ థ‌మ‌న్, దేవిశ్రీ ప్ర‌సాద్ (డీఎస్పీ) . వీరితో పాటు త‌మిళంలో రాక్ స్టార్ గా గుర్తింపు పొందాడు అనిరుధ్ ర‌విచంద‌ర్. ఇక ఎప్ప‌టి లాగే ఏఆర్ రెహ‌మాన్ త‌న స్థానం ప‌దిలంగా కాపాడుకుంటూ వ‌స్తున్నారు. ఎవ‌రికి వారే ప్ర‌తిభ క‌లిగిన సంగీత ద‌ర్శ‌కులుగా రాణిస్తున్నారు. వీరంద‌రితో పాటు తన‌లో ఇంకా చేవ త‌గ్గ‌లేదంటూ నిరూపిస్తున్నారు మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా. ఆయ‌న తాజాగా ష‌ష్టిపూర్తి చిత్రానికి అద్భుత‌మైన సంగీతం అందించారు. ఇందుకు సంబంధించిన పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి.

SS Thaman Shocking Comments

ఇక ఎస్ఎస్ థ‌మ‌న్(SS Thaman) త‌న స‌హ‌చ‌ర మ్యూజిక్ డైరెక్ట‌ర్ డీఎస్పీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ వ్యాప్తంగా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్ప‌2 చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ముందుగా థ‌మ‌న్ ను అనుకున్నారు మూవీ మేక‌ర్స్. క‌న్ ఫ‌ర్మ్ కూడా చేశారు. ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు కూడా. ఇదే స‌మ‌యంలో చిత్రానికి సంబంధించి సంగీతం కూడా అందించారు. కానీ ద‌ర్శ‌కుడికి న‌చ్చ‌లేదు. దీంతో వెంట‌నే ఎస్ఎస్ థ‌మ‌న్ ను తొల‌గించారు. ఆయ‌న స్థానంలో ఎప్ప‌టి లాగే త‌మ కాంబోలో బిగ్ స‌క్సెస్ కు కార‌ణమైన దేవిశ్రీ ప్ర‌సాద్ ను ఎంచుకున్నారు.

ఆయ‌న అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. పుష్ప‌2 బిగ్ హిట్ గా నిలిచింది. భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన 2వ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఏకంగా ఈ మూవీ రూ. 1867 కోట్లు వ‌సూలు చేసిందని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా ఎస్ఎస్ థ‌మ‌న్ త‌న‌ను ప‌క్క‌న పెట్ట‌డం ప‌ట్ల బాధ ప‌డ‌లేద‌న్నాడు. సినీ రంగంలో ఇవ‌న్నీ మామూలేనంటూ పేర్కొన్నాడు. మ‌రో వైపు తాను అందించిన డాకు మ‌హారాజ్ పాట‌లు హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వ‌డంలో త‌న‌కు త‌నే సాటి.

Also Read : Hero Vijay Sethupathi : క‌థ న‌చ్చినందుకే పూరీ జ‌గ‌న్నాథ్ తో జ‌త‌క‌ట్టా

CommentsDevi Sri Prasadss thamanViral
Comments (0)
Add Comment