SS Thaman Dynamic Update : అఖండ-2 మాములుగా ఉండదు

ఎస్ఎస్ థ‌మ‌న్ షాకింగ్ కామెంట్స్

SS Thaman : ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ థ‌మ‌న్(SS Thaman) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను సంగీతం అందించిన బాల‌య్య బాబు న‌టించిన సీక్వెల్ మూవీ అఖండ -2 చిత్రం మామూలుగా ఉండ‌ద‌న్నాడు. త‌న అభిమానుల‌కు ముందే తీపి క‌బురు చెప్పారు.

SS Thaman Shocking Comments

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా తాను అఖండ -2 మూవీకి అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాన‌ని చెప్పాడు. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను క‌సి చూస్తే ఓ రేంజ్ లో ఉండ‌బోతొంద‌ని త‌ట్టుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంద‌న్నాడు. ద‌మ్ము, ధైర్యం ఉన్నోళ్లే ఈ సినిమా చూస్తార‌ని పేర్కొన్నాడు ఎస్ఎస్ థ‌మ‌న్.

నంద‌మూరి న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, అందాల ముద్దుగుమ్మ‌లు శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్, ప్ర‌గ్యా జైశ్వాల్ , ఊర్వ‌శి రౌటేలా క‌లిసి న‌టించిన బాబీ ద‌ర్శ‌కత్వం వ‌హించిన డాకు మ‌హారాజ్ మూవీ స‌క్సెస్ మీట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

బాల‌య్య కెరీర్ లో అఖండ -2 మూవీ చిర‌స్మ‌ర‌ణీయ‌మైన సినిమాగా ఉండ‌బోతోందంటూ స్ప‌ష్టం చేశాడు . మొత్తంగా రాబోయే సీక్వెల్ చిత్రంపై బాల‌య్య అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. అందుకు త‌గ్గట్టు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను.

Also Read : RGV Shocking : రామ్ గోపాల్ వ‌ర్మ‌కు 3 నెల‌ల జైలు శిక్ష

Akhanda 2CinemaCommentsss thamanTrending
Comments (0)
Add Comment