Rajamouli : భారత దేశ సినీ రంగంలో అత్యంత జనాదరణ కలిగిన దర్శకులలో తను కూడా ఒకరు. అతనే ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ అందరూ ఆప్యాయంగా పిలుచుకునే జక్కన్న(Rajamouli). తను ఏది చేసినా సంచలనమే. నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తను ఎక్కువగా ఎక్స్ లో పోస్టులు చేస్తుంటాడు. తను సినిమా స్టార్ట్ చేశాడంటే కనీసం 2 ఏళ్లయినా పడుతుంది. కానీ పిక్చర్ రిలీజ్ అయ్యాక అది బ్లాక్ బస్టర్ కావడం, బాక్సులు బద్దలు కావడం, రికార్డులు నమోదు కావడం షరా మూమాలే. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే.
Rajamouli SSMB29 Updates
తనే అతి పెద్ద పీఆర్. సినిమాల పరంగా తన వెనక ఉంటూ నడిపించే శక్తి ఎవరైనా ఉన్నారా అంటే తన భార్య. ఆమె లేక పోతే తాను లేనంటాడు ఓ సందర్బంలో ఎస్ఎస్ రాజమౌళి. తను ప్రస్తుతం ఒడిశా అడవుల్లో సంచరిస్తున్నాడు. ఇదేదో జర్నీ అనుకుంటే పొరపాటు పడినట్లే. సినిమా షూటింగ్ లో భాగంగా బిజీగా ఉన్నాడు. ఇక హీరో, హీరోయిన్లుగా ఇప్పటికే తెలిసి పోయింది. ప్రిన్స్ మహేష్ బాబుతో ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు మాత్రమే ఇప్పటి దాకా బయటకు తెలిసిన విషయం.
తను ఏది చేసినా సీక్రెట్ గా చేస్తాడు. ఎలాంటి ప్రచారం ఉండదు. గతంలో సినిమాల కంటే భిన్నంగా ఎస్ఎస్ఎంబీ 29 మూవీ షూటింగ్ కాస్తా స్పీడ్ అందుకోవడం అందరినీ, ప్రత్యేకించి తన అభిమానులను విస్తు పోయేలా చేసింది. దీని కథను తన తండ్రి , రాజ్యసభ ఎంపీ రాశాడు. ఎప్పటి లాగే తన సోదరుడు ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ స్పీడ్ గా కొనసాగుతోంది ఒడిశా అడవుల్లో. అయితే అక్కడి కొండ గుట్టల్లో చెత్త వేయడాన్ని మనోడు గమనించాడు. దీనిని హైలెట్ చేస్తూ ఎవరి చెత్త వారు తీసుకు వెళ్లాలని కోరాడు. జక్కన్న కామెంట్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Beauty Parvathy Thiruvothu : ఆ పాత్ర సవాళ్లతో కూడుకున్నది