Rajamouli SSMB29 Sensational :ఒడిశా తూర్పు క‌నుమ‌ల్లో జ‌క్క‌న్న షూటింగ్

ప్రిన్స్ మ‌హేష్ బాబు..ప్రియాంక చోప్రా

SSMB29 : ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ29. ఇంకా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఖ‌రారు చేయ‌లేదు. ప్ర‌స్తుతం షెడ్యూల్ ప్ర‌కారం హైద‌రాబాద్ లో షూటింగ్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. కీల‌క‌మైన సన్నివేశాల‌ను జ‌క్క‌న్న ప్రిన్స్ మ‌హేష్ బాబుపై చిత్రీక‌రించారు.

SSMB29 Shooting Updates

ఈ చిత్రం పూర్తిగా అడ్వెంచ‌ర్స్ ఆధారంగా తీస్తున్నారు. ఇప్ప‌టికే క‌థ గురించి త‌న తండ్రి , రాజ్య‌స‌భ ఎంపీ విజ‌యేంద్ర ప్ర‌సాద్ వెల్ల‌డించాడు. ఈ క‌థ‌కు ఏ హీరో స‌రిపోడ‌ని, కేవ‌లం కౌబాయ్ పాత్ర‌లో కృష్ణ త‌ర్వాత త‌న త‌న‌యుడు ఆర‌డ‌గుల అందగాడు మ‌హేష్ బాబు అయితేనే బాగుంటుంద‌ని పేర్కొన్నాడు.

ఆ వెంట‌నే జ‌క్క‌న్న డిక్లేర్ చేశాడు. గ‌త కొంత కాలంగా ఈ సినిమాపై భారీగా అంచ‌నాలు పెంచేలా చేశాడు. ఆపై పులిని బంధించానంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఫోటో షేర్ చేశాడు. ఇది నిమిషాల్లోనే ల‌క్ష‌లాది మందిని ఆక‌ట్టుకునేలా చేసింది. ఆ పులి ఎవ‌రో కాదు మ‌హేష్ బాబు.

ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 చిత్రం షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుపుకుంటోంది. పూర్తిగా అడ‌వి ప్రాంతం నేప‌థ్యంగా సాగుతుండ‌డంతో చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రాజ‌మౌళి(SS Rajamouli) సినిమా అంటేనే రూ. 2000 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేస్తుంద‌ని అంచనా. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఒడిశాకు సినిమా బృందం షిఫ్ట్ అయ్యిందని, అక్క‌డి తూర్పు క‌నుమ‌ల‌లో షూటింగ్ చేయ‌నున్న‌ట్లు టాక్. మొత్తంగా ఇంకా రిలీజ్ కాకుండానే జ‌క్క‌న్న రికార్డ్ బ్రేక్ చేస్తుండ‌డం విశేషం.

Also Read : Hero Jr NTR-Neel :త‌గ్గేదే లే అంటున్న ప్ర‌శాంత్ నీల్

Mahesh BabuSS RajamouliSSMB29TrendingUpdates
Comments (0)
Add Comment