SS Rajamouli: మహేశ్‌బాబు రాజమౌళి ల ప్రాజెక్ట్ పేరు ‘గరుడ’ ?

మహేశ్‌బాబు రాజమౌళి ల ప్రాజెక్ట్ పేరు ‘గరుడ’ ?

SS Rajamouli: సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్ లో ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గురించి ఏదైనా అప్‌ డేట్‌ వస్తుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులు నిరాశపడ్డారు. ప్రస్తుతం చిత్రం బృందం దృష్టి అంతా #SSMB29కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనికి రాజమౌళి టీం లోని విజువల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్టిస్ట్‌ టీపీ విజయన్‌… తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌ ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆయన తన ఇన్‌స్టా స్టోరీస్‌ లో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలను ఉంచి #SSMB29, #SSMB29DIARIES అని పేర్కొన్నారు. దీనితో మహేశ్‌బాబు కొత్త సినిమాకు ‘గరుడ’అనే టైటిల్‌ పెట్టనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

SS Rajamouli Mahesh Movie Title

అయితే, ఈ ‘గరుడ’ ప్రాజెక్ట్‌ కొత్తదేమీ కాదు. చాలా రోజుల కిందట రాజమౌళి(SS Rajamouli)నే స్వయంగా ప్రకటించారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత తాను చేయబోయే ప్రాజెక్ట్‌ అదేనని కూడా తెలిపారు. అయితే, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రమే వెల్లడించలేదు. అయితే, అప్పుడు రాజమౌళి మదిలో ఉన్న ‘గరుడ’ ఇదేనా ? కాదా ? అన్నదానిపైనా స్పష్టత లేదు. మహేశ్‌ బాబును ఓ సరికొత్త అవతార్‌లో చూపించనున్నారు. ఇప్పటికే ఆయన సినిమాకు సంబంధించిన లుక్‌ కోసం సిద్ధమవుతున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో ఇప్పటివరకూ మహేశ్‌బాబు కనిపించని కొత్త పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో టీపీ విజయన్‌ పోస్టుతో ‘గరుడ’మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటనా వెలువడాల్సి ఉంది.

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం కాబోయే ఈ సినిమాను సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల చెప్పిన మాటల ప్రకారం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే అడ్వంచరెస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఈ సినిమాలో యాక్షన్ స్వీక్వెన్స్, ఫిట్ నెస్ మరియు కొత్త లుక్ కోసం మహేశ్ బాబు ఇప్పటికే జర్మనీ వెళ్లి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. దీనితో త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ పై ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి.

Also Read : Nithya Menen: విజయ్‌ సేతుపతి సరసన నిత్యా మీనన్‌ ?

Mahesh BabuSS RajamouliSSMB29
Comments (0)
Add Comment