Karan Johar Impressive :జ‌క్క‌న్న మామూలోడు కాదు జీనియ‌స్

ఆస్కార్ డైరెక్ట‌ర్ పై క‌ర‌ణ్ జోహార్

Karan Johar : జ‌క్క‌న్న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న త‌ను ఏది కావాల‌ని అనుకున్నాడో దానిని పొందేంత వ‌ర‌కు నిద్ర పోడు. ఎవ‌రినీ నిద్ర పోనివ్వ‌డు. ఒక ర‌కంగా చెప్పాలంటే మోనార్క్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌ను తీసే మూవీలో చిన్న పాత్ర దొరికితే చాలు అని కోరుకునే వాళ్లు కోకొల్ల‌లు. బాహుబ‌లి త‌ర్వాత తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచ మార్కెట్ లోకి తీసుకెళ్లాడు. గ‌తంలో ఎన్నో చిత్రాలు వ‌చ్చినా ఎస్ఎస్ రాజ‌మౌళి తీసిన బాహుబ‌లి రికార్డుల‌ను బ్రేక్ చేసింది. కోట్లు కురిపించింది. బాహుబ‌లి సీక్వెల్ కూడా వ‌చ్చేసింది. ఇందులో న‌టించిన ప్ర‌భాస్ , అనుష్క శ‌ర్మ న‌ట‌న ఆక‌ట్టుకునేలా చేసింది.

Karan Johar…

త‌ను తీయ‌బోయే సినిమా గురించి ప్ర‌క‌టించ‌డం, దాని కోసం కొన్నేళ్లు నిరీక్షించ‌డం రాజ‌మౌళి వ‌ర్క్ లో భాగం. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌ను తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎంఎం కీర‌వాణి, ర‌చ‌యిత చంద్ర‌బోస్ కు పుర‌స్కారం ల‌భించింది.

ఆ త‌ర్వాత ఎవ‌రితో మూవీ తీస్తాడ‌నే దానికి పుల్ స్టాప్ పెట్టాడు జ‌క్క‌న్న‌. ఎస్ఎస్ఎంబీ29 పేరుతో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రాతో ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో చిత్రీక‌ర‌ణ స్టార్ట్ చేశాడు. ఇప్ప‌టికే రిలీజ్ కాకుండానే రికార్డ్ బ్రేక్ చేస్తోంది. తాజాగా జ‌క్క‌న్న‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్(Karan Johar). రాజ‌మౌళి, వంగా సందీప్ రెడ్డిల‌ను ఆకాశానికి ఎత్తేశాడు. వాళ్లు త‌మ సినిమా కోసం ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కార‌ని కితాబు ఇచ్చాడు. వాళ్లు జీనియ‌స్ అంటూ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Also Read : Hero Ibrahim Ali-Kushi Kapoor :ప్రేమ మ‌ధురం ప్రియురాలు క‌ఠినం

AppreciationCommentsKaran JoharTrending
Comments (0)
Add Comment