SS Rajamouli: టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియాలో రానున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ‘పుష్ప: 2 ది రూల్’ ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప ది రైజ్’కు సీక్వెల్ గా తెరరకెక్కిస్తున్న ‘పుష్ప: 2 ది రూల్’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ సినిమా నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా వైరల్ గా మారుతోంది.
SS Rajamouli in Pushpa-2 Sets..
ఈ నేపథ్యంలో ‘పుష్ప2’ సినిమా షూటింగ్ లోకేషన్ కు రాజమౌళి వెళ్లి అక్కడి వారిని సర్‌ఫ్రైజ్ చేశాడు. ఈ సందర్భంగా సుకుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ వారు దిగిన సెల్పీని షేర్ చేశారు. మహేశ్‌బాబుతో తాను చేయబోయే సినిమా పనుల కోసం… ‘పుష్ప: 2 ది రూల్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవుతున్న స్టూడియోకు వెళ్లి అక్కడి వారిని సర్‌ఫ్రైజ్ చేశాడు రాజమౌళి. ఈ సందర్భంగా సకుమార్, పుష్ఫ2 సినిమాటోగ్రాఫర్ మిరోస్లా బ్రోజెక్ తో కలిసి రాజమౌళి సెల్ఫీ తీసుకున్నారు.
ఈ ఫొటోను దర్శకుడు సుకుమార్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ… దర్శకుల బాహుబలి పుష్ప 2 సెట్ లో… రాజమౌళి(SS Rajamouli) గారిని మా సినిమా సెట్ లో చూడడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది, అతను ఇక్కడికి రావడం మాకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందంటూ పోస్టు పెట్టాడు. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, మరోకరు పుష్ప సినిమాతో టాలీవుడ్ హీరోక నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ లు ఒకే దగ్గర కలవడం అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Nayanthara: యాభై సెకన్ల యాడ్ కు ఐదు కోట్లు తీసుకున్న లేడీ సూపర్ స్టార్ ?