Mahesh : ఎవరీ జక్కన్న అనుకుంటున్నారా టాలీవుడ్ లో అందరూ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ముద్దుగా పిలుచుకుంటారు. తను ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. ఎస్ఎస్ఎంబీ29 పేరుతో ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh)తో పాన్ వరల్డ్ అడ్వంచర్ మూవీని తెరకెక్కించేందుకు శ్రీకారం చుట్టాడు. ఇందుకు సంబంధించి అద్భుతమైన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు.
Mahesh-Rajamouli ‘SSMB29’ Movie Updates
విచిత్రం ఏమిటంటే సింహం బోనులో లాక్ చేశామంటూ పేర్కొన్నాడు. ఆ సింహం ఎవరో కాదు అందగాడు మహేష్ బాబు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి భారీ ఎత్తున సెట్ వేశారు హైదరాబాద్ లో. కానీ ఈ మూవీ చిత్ర విశేషాలు ఏవీ కూడా బయటకు రావడం లేదు. ఇందుకు గాను జక్కన్న ఓ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడట. సినిమాలో నటిస్తున్న వారితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు సైతం ఎక్కడ కూడా వివరాలు వెల్లడించ కూడదని.
ఒకవేళ అలా ఎవరైనా నోరు జారినా లేదా విషయం గురించి చర్చించినా చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకు కొత్త మూవీలో ఎవరు నటిస్తున్నారనేది కూడా గోప్యంగా ఉంచాడు రాజమౌళి. ఇతర దర్శకులకు తనకు ఉన్న తేడా ఇదే. తను సినిమాను ఓ యజ్ఞం లాగా భావిస్తాడు. తనకు ప్రకృతి అంటే ఇష్టం. ఇదే సమయంలో దేవుడిని నమ్మడు. మొత్తంగా ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీ రోల్ లో నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read : Rashmika Shocking : డేటింగ్ లో ఉన్నానన్న మందన్న