Sriya Reddy: ‘రాధా రమ మన్నార్’ పాత్రపై శ్రియారెడ్డి ఎమోషనల్

‘రాధా రమ మన్నార్’ పాత్రపై శ్రియారెడ్డి ఎమోషనల్

Sriya Reddy: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో కేజిఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా ‘సలార్‌’. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా… బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సంపాదించి, బాక్సాఫీసు ముందు కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాలో కీలకమైన ‘రాధా రమ మన్నార్’ పాత్రలో నటించింది ప్రముఖ నటి శ్రియారెడ్డి. ఈ సందర్భంగా ‘రాధా రమ మన్నార్’ పాత్ర సృష్టికర్త దర్శకుడు ప్రశాంత్ నీల్ కు… ప్రత్యేక ధన్యావాదాలు తెలిపింది నటి శ్రియారెడ్డి.

సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడితో దిగిన ఓ ఫొటోని షేర్‌ చేసిన శ్రియారెడ్డి(Sriya Reddy)… ‘‘ప్రశాంత్‌.. రాధారమ పాత్రను స్క్రీన్‌పై ఎంతో పవర్‌ఫుల్‌గా చూపించావు. ‘రాధారమ ఎప్పుడూ నవ్వదు’ అంటూ ఈ పాత్రను ఉద్దేశించి సెట్‌లో నువ్వు చెప్పిన మాటలు నాకింకా గుర్తు ఉన్నాయి. ఒక మహిళ కోసం ఇలాంటి అద్భుతమైన పాత్రను రూపొందించడానికి నిజంగా ధైర్యం కావాలి. ఈ పాత్రతో నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి నన్ను బయటకు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. నాకు చెప్పినట్టుగానే స్క్రీన్‌పైకి రాధారమ పాత్రను తీసుకువచ్చావు’’ అంటూ ఆమె తన పోస్ట్ లో రాసుకొచ్చారు. దీనితో శ్రియారెడ్డి పోస్ట్ చూసిన నెటిజన్లు… ‘సలార్‌’లో మీ యాక్టింగ్‌ బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Sriya Reddy – యాంకర్ నుండి ‘సలార్’

యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన శ్రియారెడ్డి… ‘అప్పుడప్పుడు’ అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత విశాల్‌ హీరోగా నటించిన ‘పొగరు’ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో ఆమె నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించారు. ఆ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. శుక్రవారం విడుదలైన ‘సలార్‌’ లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సోదరిగా శ్రియారెడ్డి నటించారు. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాలోను కూడా అవకాశం దక్కించుకున్నారు.

Also Read : Shah Rukh Khan: కింగ్ ఖాన్ షారుఖ్ కు హ్యాండ్ ఇచ్చిన మరాఠా మందిర్

salarSriya Reddy
Comments (0)
Add Comment