Sriranga Neetulu : సుహాస్(Suhas), కార్తీక్ రత్నం, రుహాని శర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన నటులుగా నటించిన చిత్రం శ్రీ రంగ నీతులు. ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ డైరెక్టర్. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 12న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత ధీరజ్ మొగిలిన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం నుండి ఎక్కడ వుండాలని.. ఎక్కడున్నావో.. ఏమీ అవుదామని.. ఏమీ అయ్యావో అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పాటకు సంగీతం అందించగా, శ్రీమణి సాహిత్యం రాశారు. దీనిని హారిక నారాయణ్ పాడారు.
Sriranga Neetulu Movie Song Viral
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. మానవ సంబంధాలు, నేటి యువత మనస్తత్వాలు, ప్రేమకు సంబంధించిన కాన్సెప్ట్‌లపై ఈ పాట సాగుతుందని తెలిపారు. యూత్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలోని ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలో పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్ తో పాటు కొత్తదనం కూడా ఉంటుందని తెలిపారు. నేటి యువతరం ఆలోచనలు, కుటుంబ బంధాలు, వినోదం వంటి అన్ని అంశాలను దర్శకుడు మేళవించి అందరూ ఎంజాయ్ చేసేలా చిత్రాన్ని రూపొందించారని నిర్మాత తెలిపారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నానన్నారు. ఏప్రిల్ 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read : Kalki 2898 AD : కల్కిలో ప్రభాస్ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాత స్వప్నాదత్