Srinidhi Shetty: రానా సరసన ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ బ్యూటీ ?

రానా సరసన ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ బ్యూటీ ?

Srinidhi Shetty: ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ప్రస్తుతం ఆమె డీజే టిల్లు ఫేం సిద్ధు జొన్నలగడ్డలతో కలిసి ‘తెలుసు కదా’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఆమె తెలుగులో మరో అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి హీరోగా ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కిశోర్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రానా సరసన శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది.

Srinidhi Shetty Movie Updates

రానా ప్రస్తుతం రజనీకాంత్‌ తో కలిసి ‘వేట్టయాన్‌’లో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత తేజ దర్శకత్వంలో ‘రాక్షస రాజ్యం’ సినిమా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తరువాత శ్రీనిధి కి రానా సరసన నటించే అవకాశం వస్తుంది. అయితే అంతవరకు ఈమె వెయిట్ చేస్తుందా లేదా బిజీ స్టార్ గా మారి రానాతో అవకాశం వదులుకుంటుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Also Read : Sudha Kongara: సుధా కొంగర దర్శకత్వంలో ధనుష్‌ ?

Daggubati RanakgfSrinidhi Shetty
Comments (0)
Add Comment