Srinidhi Shetty: టాలీవుడ్ లో శ్రీనిధీ శెట్టి డబుల్‌ ధమాకా ?

టాలీవుడ్ లో శ్రీనిధీ శెట్టి డబుల్‌ ధమాకా ?

Srinidhi Shetty: కన్నడ హిట్‌ ఫ్రాంచైజీ ‘కేజీఎఫ్‌’లో యాక్షన్ హీరో యశ్ సరసన హీరోయిన్‌ గా నటించిన పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీనిధీ శెట్టి. ప్రస్తుతం ఆమె సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘తెలుసు కదా’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం కానున్నారు. అయితే ‘తెలుసు కదా’ విడుదల కాకముందే డబుల్‌ ధమాకాలా మరో రెండు తెలుగు సినిమాల్లో శ్రీనిధికి ఆఫర్స్‌ దక్కాయట. రానా హీరోగా నటించనున్న ఓ సినిమాలో శ్రీనిధి హీరోయిన్‌గా ఎంపికయ్యారని ప్రచారం జరుగుతోంది.

Srinidhi Shetty Movies Update

తాజాగా నాని హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందనున్న ‘హిట్‌ 3’ సినిమాలోనూ హీరోయిన్‌గా శ్రీనిధీ శెట్టిని తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. ఆ తర్వాత ‘హిట్‌ 3’ని ఆరంభించే ఆలోచనలో ఉన్నారట. సో…. ‘సరిపోదా శనివారం’ రిలీజ్‌ తర్వాత కానీ ‘హిట్‌ 3’ సినిమాలో ఎవరు హీరోయిన్‌ గా నటిస్తారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read : Dushara Vijayan: 35 వయసు దాటగానే తన పని విదేశీయానమే అంటున్న దుషారా విజయన్ !

kgfNatural Star NaniRana DaggubatiSiddu JonnalagaddaSrinidhi Shetty
Comments (0)
Add Comment