Srileela: బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల ?

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల ?

Srileela: తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది శ్రీలీల. అమెరికాలో స్థిరపడిన భారతి సంతతికి చెందిన శ్రీలీల… 2019లో కిస్ అనే కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 2021లో పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన అందమైన స్టెప్పులతో కుర్రకారును కట్టిపడేసిన శ్రీలీల(Srileela) అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయంది. రవితేజ, నితిన్, బాలకృష్ణ, మహేశ్ బాబులతో వరస సినిమాల్లో నటించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా నటిస్తోంది.

Srileela Movies

అయితే ఇటు అగ్రహీరోలతోనూ అటు కుర్ర కథానాయకులతోనూ జోడీ కడుతూ వరుస సినిమాలతో జోరు చూపిస్తోన్న ఈ యంగ్ బ్యూటీ…. ఇప్పుడు బాలీవుడ్‌లో తొలి అడుగు వేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌ హీరోగా కునాల్‌ దేశ్‌ముఖ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కోసం శ్రీ లీల పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మడాక్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా కోసం నాయికగా శ్రీలీల పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడీ విషయమై కథా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీతో తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగస్టు నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు తెలిసింది. ఇక శ్రీలీల ప్రస్తుతం తెలుగులో పవన్‌ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లో నటిస్తోంది. అలాగే రవితేజ – భాను భోగవరపు కలయికలో తెరకెక్కనున్న చిత్రంలోనూ కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

Also Read : Shruti Haasan : సోలో లైఫ్ సో బెటర్ అంటున్న లవ్ ఫెయిల్యూర్ భామ

Guntur KaaramsrileelaUstad Bhagat Singh
Comments (0)
Add Comment