Sri Sri Sri Rajavaru: ఎట్ట‌కేల‌కు విడుదలకు సిద్ధమైన ఎన్టీఆర్‌ బావమరిది తొలి సినిమా !

ఎట్ట‌కేల‌కు విడుదలకు సిద్ధమైన ఎన్టీఆర్‌ బావమరిది తొలి సినిమా !

Sri Sri Sri Rajavaru: యంగ్ టైగర్ ఎన్టీఆర్… ప్రముఖ పారిశ్రామిక వేత్త, స్టూడియో ఎన్ అధినేత నార్నే శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీనితో బావ ఎన్టీఆర్ సూర్తితో… ఎన్టీఆర్‌ బావమరిది నార్నె నితిన్ సినిమాల్లోనికి అడుగుపెడుతున్నాడు. నార్నె నితిన్, సంపద హీరో హీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రావు రమేష్(Rao Ramesh), నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం కైలాష్ మీనన్ అందిస్తుండగా కెమెరా దాము నర్రావులగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమా… ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రశంసలు అందుకుంది.

Sri Sri Sri Rajavaru Movie Updates

శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంపద హీరో హీరోయిన్లుగా శ‌త‌మానంభ‌వ‌తి వంటి భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన సతీష్ వేగేశ్నదర్శకత్వంలో ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు. అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U A సర్టిఫికెట్ పొందటంతో పాటు, సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ… ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయన్నారు. అలాగే మా దర్శకుడు సతీష్ వేగేశ్న మంచి అభిరుచి ఉన్న డైరెక్ట‌ర్‌గా పేరుందని… ఆయన ఈ చిత్రాన్ని రూపొందించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేస్తుందని అన్నారు. అలాగే మా సినిమా ఇటీవలే సెన్సార్ సభ్యుల ప్రశంసలతో U A సర్టిఫికెట్ పొందడం సంతోషంగా ఉందని… చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తామ‌ని అన్నారు.

Also Read : Pawan Kalyan: నూకాంబికా అమ్మవారి సేవలో పవన్ కళ్యాణ్ !

Narne NithinNTRSri Sri Sri Rajavaru
Comments (0)
Add Comment