Sreelekha Mitra : తాజాగా వెలుగులోకి వచ్చిన హేమ కమిటీ రిపోర్టు మలయాళ సినిమా ఇండస్ట్రీనీ కాకావికలం చేస్తుంది. అప్పుడెప్పుడో దశాబ్దం క్రితం హీరోయిన్ భావనకు కేరళ(Kerala)లో ఎదురైన ఘటనతో నాడు ఏర్పాటు చేసిన హేమ కమిటీ(Hema Cimittee) ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించాక బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రోజుకొకరు చొప్పున నటీమణులు బయటకు వచ్చి తమకు గతంలో ఎదురైన సంఘటనలను చెబుతండడంతో ఈ ఇష్యూ ఇప్పుడు పెద్దదవుతూ వస్తోంది. ‘ పలేరి మాణిక్యం’ సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నా. ఆడిషన్లో భాగంగా దర్శకుడిని కలిశా. సినిమాటోగ్రాఫర్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఆయన నా చేతి గాజులను తాకారు. నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. అనంతరం నా మెడపై చేయి వేశారు. అక్కడ ఉండలేక వెంటనే ఆయన రూమ్ నుంచి బయటకు వచ్చేశా.
Sreelekha Mitra Comment
ఆ సమయంలో ఈ విషయాన్ని నేను ఎవరితోనూ చెప్పలేకపోయా. ఆ రాత్రి మొత్తం హోటల్ రూమ్‌లో భయపడుతూ ఉన్నాను. ఎవరైనా వచ్చి తలుపు కొడతారేమోనని కంగారుపడ్డాను. త్వరగా తెల్లవారితే బాగుండును అనుకున్నా. ఈ సంఘటన తర్వాత ఇంటికి వెళ్లడానికి నాకు రిటర్న్ టికెట్లు కూడా ఇవ్వలేదు. దీని తర్వాత మలయాళీ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అని శ్రీలేఖ మిత్రా(Sreelekha Mitra) తెలిపారు. ‘ పలేరి మాణిక్యం’ సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడు నా చేతి గాజులను తాకడంతో పాటు నా మెడపై చేయి వేశారు. అక్కడ ఉండలేక వెంటనే ఆయన రూమ్ నుంచి బయటకు వచ్చేశా అంటూ వారం రోజుల క్రితం.. కేరళ(Kerala) రాష్ట్ర చలచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలకృష్ణన్ పై బెంగాళీ నటి శ్రీలేఖ మిత్ర(Sreelekha Mitra) ఆరోపణలు చేయగా ఈ న్యూస్ మల్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
తన సినిమాలో తనకు అవకాశం ఇవ్వలేదనే దురుద్దేశంతో కావాలని నాపై ఆరోపణలు చేస్తుందని రంజిత్ తెలిపినా విమర్శల తీవ్రత ఎక్కువవడంతో తను ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కేరళ రాష్ట్ర చలచిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై కేరళ మంత్రి సాజీ చెరియన్ స్పందించారు. ‘‘ ఆమె బహిరంగంగా ఆరోపణలు చేశారు. దర్శకుడు వాటిని ఖండించారు. ఈ విషయంపై ఆమె ఫిర్యాదు చేసి ఉంటే దర్యాప్తు చేయవచ్చు. విచారణ లేకుండా ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని భావించలేం’’ అని అన్నారు.
ఆది మరువక ముందే తాజాగా ప్రముఖ మలయాళ నటుడు, నిర్మాత సిద్ధిఖీ నన్ను ట్రాప్ చేసి రేప్ చేయడంతో పాటు నా ఫ్రెండ్స్ ను కూడా ఇబ్బంది పెట్టాడంటూ నటి , రేవతి సంపత్ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ప్రస్తుతం మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేసి ఆ లేఖను ప్రెసిడెంట్ మోహన్ లాల్‌కు అందజేశాడు.
తనపై వచ్చిన ఆరోపణల కారణంగానే తాను ఈ పదవి నుంచి వైదొలుగుతున్నానని, ఈ పరిస్థితిలో పదవిలో కొనసాగడం సరికాదని, తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత స్పందిస్తానని సిద్ధిక్ తెలిపారు. ఇదిలాఉండగా ఇటీవల వచ్చిన హేమ కమిటీ(Hema Comittee) నివేదికపై మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సిద్ధిఖీ మాట్లాడుతూ.. నటీమణులపై లైంగిక వేధింపులను సహించేది లేదని, బాధితులకు అసోసియేషన్ అండగా ఉంటుందని ప్రకటించిన రెండు రోజుల్లోనే ఇప్పుడు ఆయన పైనే ఆరోపణలు రావడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అంతకాదు మున్మేందు ఇంకా ఎవరి పేర్లు బయటకు వష్తాయో, ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందోనని మలయాళ నటులు తర్జనభర్జన పడుతున్నారు.
Also Read : Malavika Mohanan : నా మొదటి తెలుగు సినిమా డార్లింగ్ ప్రభాస్ తో చేయడం అదృష్టం
Sreelekha Mitra : మలయాళ ఇండస్ట్రీలో జరుగుతున్న హింస పై స్పందించిన మరో నటి
ఆ సమయంలో ఈ విషయాన్ని నేను ఎవరితోనూ చెప్పలేకపోయా.