Pushpa 2-Sreeleela : పుష్ప 2 నుంచి డ్యాన్సింగ్ క్వీన్ ‘శ్రీలీల’ దిమ్మతిరిగే పోస్టర్

‘పుష్పది రైజ్‌’లోని ‘ఊ అంటావా మావ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు...

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ బజ్ క్రియేట్ చేసేందుకు భారీ ప్లాన్స్ తో రంగంలోకి దిగారు.ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం శ్రీలీలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ షూట్ కొనసాగుతుంది. పుష్ప 2(Pushpa 2) సినిమాలో ‘కిస్సిక్’ అనే సాంగ్‌ని పెట్టనున్నారని నిన్న, మొన్న వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేసింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్పెషల్ ఐటెం నంబర్‌గా ఈ సాంగ్‌ని షూట్ చేస్తున్నారు. తాజాగా ఈ పోస్టర్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సాంగ్‌లో బన్నీ కూడా తన స్వాగ్ అండ్ డ్యాన్సింగ్ మూవ్స్‌తో అదరగొట్టబోతున్నాడు.

Pushpa 2 – Sreeleela Song Updates

‘పుష్పది రైజ్‌’లోని ‘ఊ అంటావా మావ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్‌, సమంత స్టెప్పులు ఎంతగా ఆకట్టుకున్నాయె తెలిసిందే. పుష్ప 2లో కూడా అదే స్థాయిలో ఓ సాంగ్‌ ఉంటుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. బాలీవుడ్‌ నటి శ్రద్థాకపూర్‌తోపాటు పలువురు పేర్లు వినిపించాయి. శ్రద్ధాకపూర్‌ డేట్స్‌ వర్కవుట్‌ కాకపోవడంతో ఆ స్థానంలో శ్రీలీల వచ్చి చేరింది. అయితే పుష్ప 1లోను డ్యాన్సలకు మంచి ప్రిఫరెన్స్ ఉన్న.. ఐటెం సాంగ్‌లో మాత్రం సమంతకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. పార్ట్ 2లో అది జరిగిన జరగనున్న అల్లు అర్జున్ మామూలు డ్యాన్సర్ ఏమి కాదు. వీళిద్దరి కెమిస్ట్రీ కరెక్ట్ కుదిరితే ‘ఊ అంటావా మావ’ కన్నా పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Also Read : Actress Kasturi : పోలీసులకు చిక్కకుండా పరారీలో సీనియర్ నటి ‘కస్తూరి’

MoviesPushpa 2SreeleelaTrendingUpdatesViral
Comments (0)
Add Comment