Sreeleela : శ్రీలీల.. ఈపేరు రెండు తెలుగు రాష్టాల్లో ఓ సెన్షేషన్. ఈ పేరు తెలియని ప్రేక్షకుడంటూ, పరిచయం లేని వ్యక్తి అంటూ ప్రస్తుతం తెలుగు నాట ఉండడం అరుదు. అంతగా ఈ పదహారణాల తెలుగందం తన సినిమాలతో ప్రత్యకించి డ్యాన్సులతో సినీ అభిమానులను సమ్మోహితులను చేసింది, చేస్తోంది. అంతేగాక అనాథలకు, ఫిజికల్, మెంటల్లీ డిజుబుల్ పర్సన్స్‌కు వీలైనంతలో సాయం చేస్తూ తనకున్న సేవాగుణం, మానవత్వాన్ని కూడా ప్రపంచానికి తరుచూ చాటుతుంది.
Sreeleela Entertain..
ఎంత ఒదిగినా భూమి మీద నడవాలనే పద్దతిని తూచా తప్పకుండా పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. సాధారణ యువతిలా అందరిలో కలిసిపోతూ ఔరా అనిపిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తను నటిస్తోన్నఓ చిత్రం షూటింగ్ కోసం ఆంద్రప్రదేశ్ అరకుకు వెళ్లింది. అయితే షూటింగ్ విరామం మధ్యలో తన తల్లితో కలిసి రోడ్డు వెంబడి ఓ మహిళ నడిపిస్తోన్న ఉన్న టీ షాప్‌కు వెళ్లి టీ తాగి అక్కడ కాసేపు సందడి చేసింది. అక్కడి వారిని నవ్వుతూ పలకరిస్తూ, వారితో కలిసిపోయి, వారితో ఫొటోలు దిగి వారిని ఆనంద పరిచింది. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి.
Also Read : Hero Prabhas : డార్లింగ్ ఫ్యాన్స్ కు నిరుత్సాహం…సలార్, ఫౌజీ సినిమాల నుంచి నో అప్డేట్