Sreeleela : అందాల ముద్దుగుమ్మ శ్రీలీల సంచలనంగా మారారు. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. దీనికి కారణం తాజాగా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఆషికి 3 లవ్ స్టోరీ కథనంతో ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఇప్పుడు శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ లకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ తరుణంలో ఇటీవలే కార్తీక్ కుటుంబంలో జరిగిన వేడుకలో స్పెషల్ గా అటెండ్ అయ్యారు శ్రీలీల(Sreeleela). తను అద్భుతంగా డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ చేసింది.
Sreeleela-Karthik Aryan Dating Viral
తనను వీడియో తీశాడు కార్తీక్. అలా చేయొద్దంటూ నవ్వుతూ అభ్యంతరం తెలిపింది లవ్లీ బ్యూటీ. ఇదిలా ఉండగా ఈ ఇద్దరి గురించిన వీడియో , ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశారు. వైరల్ కావడంతో ప్రస్తుతం బాలీవుడ్ , టాలీవుడ్ లో శ్రీలీల, కార్తీక్ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని, పీకల లోతు ప్రేమలో కూరుకు పోయారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా కార్తీక్ ఆర్యన్ సోదరి డాక్టర్ కృతికా తివారీ కోసం నిర్వహించిన పార్టీకి హాజరైంది శ్రీలీల. ఇద్దరి మధ్య క్లిప్ నటుల మధ్య ఉన్న ప్రేమ వ్యవహారాన్ని మరింత బయట పెట్టేలా చేసింది. ఇదిలా ఉండగా కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇదంతా పీఆర్ స్టంట్ అంటూ పేర్కొన్నారు.
Also Read : Dragon Movie Sensational :28న నెట్ ఫ్లిక్స్ లో డ్రాగన్ స్ట్రీమింగ్