Sreeleela : సిల్వర్ స్క్రీన్ మీద శ్రీలీల మరో లీల

ఈ ఏడాది మాత్రం సంక్రాంతితోనే సరిపెట్టుకున్నారు...

Sreeleela : ఎప్పుడూ కళకళలాడుతూ కళ్లముందు కనిపించిన అమ్మాయి… ఉన్నపళాన సైలెంట్‌గా ఎక్కడికెళ్లిపోయింది అని ఇక ఎవరూ అనుకోవడానికి లేదు. కాసింత ఆగండి…. మిమ్మల్ని బ్యాక్‌ టు బ్యాక్‌ పలకరించడానికే రెడీ అవుతున్నానంటూ హింట్‌ ఇస్తున్నారు మిస్‌ శ్రీలీల(Sreeleela). సిల్వర్‌స్క్రీన్‌ మీద ఏం లీలలు చేయడానికి రెడీ అవుతున్నారా అని ఆలోచిస్తున్నారు కదూ.. పదండి చూసేద్దాం… కెరీర్‌ బిగినింగ్‌ నుంచే సీనియర్‌, జూనియర్‌ అనే తేడా చూడటం లేదు శ్రీలీల. మంచి కాన్సెప్ట్ ఉంటే చాలు… నేను సైన్‌ చేస్తా అంటూ వరుసబెట్టి సినిమాలు చేశారు. 2023లో ఏ సీజన్‌లో చూసినా మళ్లీ మళ్లీ కనిపించారు శ్రీలీల.

Sreeleela…

ఈ ఏడాది మాత్రం సంక్రాంతితోనే సరిపెట్టుకున్నారు. గుంటూరుకారంలో నటించిన సూపర్‌స్టార్‌ మహేష్‌తో అప్లాజ్‌ అందుకున్న ఈ బ్యూటీ, ఆ తర్వాత కొన్నాళ్లుగా సైలెంట్‌ అయిపోయారు. విజయ్‌ గోట్‌లో ఆడిపాడే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించారంటూ వార్తలొస్తున్నాయి. మరి ఇప్పుడేం చేస్తున్నట్టు అనుకుంటున్నారా? బాలీవుడ్‌ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. అంతే కాదు, విజయ్‌ దేవరకొండతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతాయి. అంతే కాదు, పవర్‌స్టార్‌తో కలిసి వచ్చే ఏడాది పలకరించడానికి కూడా ఈ భామ సిద్ధమవుతున్నారు.

పవర్‌స్టార్‌ సినిమాతో పాటు, ఆయన వీరాభిమాని నితిన్‌ రాబిన్‌హుడ్‌లోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ. అంతా అనుకున్న ప్రకారం జరిగితే రాబిన్‌హుడ్‌ ఈ డిసెంబర్‌కి రావాలి. అలా కాని పక్షంలో 2025 క్యాలండర్‌కి ఫిక్సవ్వాలి. వీటన్నిటిని బట్టి 2025లో ప్రతి సీజన్‌లోనూ తన ప్రెజెన్స్ ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు శ్రీలీల. వాటిలో ఏ ఒక్కటి హిట్‌ అయినా లైఫ్‌ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఏమాత్రం తేడా జరిగినా డాక్టర్‌గిరీని సీరియస్‌గా తీసుకోవాల్సిందేనేమో మరి…!

Also Read : Katrina Kaif : సేతుపతి సినిమా ‘మహారాజ’ కు బాలీవుడ్ భామ ప్రశంసలు

Indian ActressMoviesSreeleelaTrendingUpdatesViral
Comments (0)
Add Comment