Sreela Majumdar: ప్రముఖ బెంగాలీ నటి శ్రీల మజుందార్ (65) మృతి చెందింది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న శ్రీల మజుందార్… ఇటీవలే కోలుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది. అయితే ఇంతలోనే ఏమైందో ఏమో గాని శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించి… కోల్ కతాలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచింది. గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న శ్రీల… నెల రోజుల క్రితమే అనారోగ్యానికి గురైంది. అయితే కొన్నాళ్లు హాస్పిటల్‌లో ఉంచడంతో కాస్త కోలుకుంది. ఇటీవలే హాస్పిట్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. ఇంతలోనే ఇలా జరిగిందని శ్రీల మజుందార్ భర్త, జర్నలిస్టు ఎస్ఎన్ఎమ్ అబ్ది అధికారికంగా వెల్లడించారు.
Sreela Majumdar No More
శ్రీల మజుందార్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘‘సినీ నటి శ్రీలా మజుందార్(Sreela Majumdar) మృతి చెందారనే వార్త చాలా బాధాకరం. శ్రీల అనేక ముఖ్యమైన భారతీయ చిత్రాల్లో అత్యుత్తమ పాత్రలు పోషించిన ప్రముఖ, శక్తివంతమైన నటి. ఇది బెంగాల్ చిత్ర పరిశ్రమకు పెద్ద నష్టం. అంటూ ఆమె పోస్ట్ చేసారు.
శ్రీల మజుందార్ 1980లో 16 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్ మొదలుపెట్టింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అకాలేర్ సందానే, ఏక్ దిన్ ప్రతిదిన్, కరీజ్ లాంటి సినిమాలు శ్రీల మజుందార్ కెరీర్‌లో మైలురాళ్ల లాంటి చిత్రాలని చెప్పొచ్చు. దిగ్గజ డైరక్టర్ మృణాల్ సేన్-శ్రీల కాంబోలో వచ్చిన కొన్ని చిత్రాలైతే బెంగాలీ ఇండస్ట్రీలో ఐకానిక్‌గానూ నిలిచిపోయాయి. ఆమె శ్యామ్ బెనగల్ ‘మండి’, ప్రకాష్ ఝా ‘దాముల్’, ఉత్పలేందు చక్రవర్తి యొక్క ‘చోఖ్’ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. ఆమె చివరి చిత్రం కౌశిక్ గంగూలీ ‘పాలన్’, ఇది ‘ఏక్ దిన్ ప్రతిదిన్’కి సీక్వెల్.
Also Read : Allu Arjun Movies : పుష్ప 2 తర్వాత బోయపాటితో బన్నీ సినిమా ఇదే..