వరంగల్ – అనిల్ రావిపూడి దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ , శ్రీలీల, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన భగవంత్ కేసరి చిత్రం ట్రైలర్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఓరుగల్లులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రాండ్ గా విడుదల చేశారు.
టేకింగ్ లో మేకింగ్ లో మోస్ట్ టాలెంటెడ్ కలిగిన దర్శకుడిగా గుర్తింపు పొందారు అనిల్ రావిపూడి. అద్భుతంగా తెర కెక్కించే ప్రయత్నం చేశాడు. ప్రతి సినిమాలో కాస్తంత కామెడీకి ప్రయారిటీ ఇచ్చే దర్శకుడు ఉన్నట్టుండి బాలయ్యలో వీర రౌద్రాన్ని చూపించే ప్రయత్నం చేశాడు.
గతంలో బోయపాటి శ్రీనుకు ఆ పేరు ఉండేది. కానీ ఎవరూ ఊహించని రీతిలో బాలకృష్ణను అద్భుతంగా నటించేలా చేశాడు. తాను వంద శాతం ఆశిస్తే వేయి శాతం తను ఇచ్చిన పాత్రకు బాలయ్య బాబు న్యాయం చేశాడని ప్రశంసలు కురిపించాడు.
ఒకానొక సమయంలో ఉద్వేగానికి లోనయ్యాడు దర్శకుడు అనిల్ రావి పూడి. ఈ సందర్బంగా నటి శ్రీలీల మాట్లాడుతూ తన జీవితంలో మరిచి పోలేని పాత్రను ఇచ్చారని, దర్శకుడికి రుణపడి ఉంటానని చెప్పారు. ఇక బాలయ్య బాబు గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొంది.