Sree Leela : ఈ మధ్యనే డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన లవ్లీ బ్యూటీ శ్రీలీల(Sree Leela) సంచలనంగా మారారు. తను పూర్తిగా లవ్ లో కూరుకు పోయారని, బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ లోఉందని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్యన తన ఇంట్లో జరిగిన కార్యక్రమానికి హాజరైంది. అంతేనా అద్భుతంగా డ్యాన్స్ కూడా చేసింది. తను తాజాగా నటించిన చిత్రం వెంకీ కుడుముల తీసిన రాబిన్ హుడ్ ఆశించిన మేర ఆడలేదు. అయినా తనకు సినిమాలలో మాత్రం పెద్ద ఎత్తున ఛాన్స్ లు వస్తున్నాయి. ఇది తన కెరీర్ కు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉందన్నది వాస్తవం.
Sree Leela-Karthik Aryan..
ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఆషిఖి-3 చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది శ్రీలీల. ఇందులో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) హీరో. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కూడా కొనసాగుతోంది. దర్శకుడు , నిర్మాత వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్ తో పాటు ఓ లవ్ సాంగ్ ను విడుదల చేశారు. మంచి ఫీల్ గుడ్ కలిగించేలా ఉంది. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ షూటింగ్ సందర్బంగా ఇద్దరూ పీకల లోతు ప్రేమలో కూరుకు పోయారని సినీ వర్గాలలో టాక్.
ఇద్దరి మధ్య లవ్ , రొమాన్స్ కెమిస్ట్రీ సూపర్ గా ఉందని, ఇది సినిమాకు మరింత అందాన్ని చేకూర్చేలా చేస్తుందని దర్శకుడు అంటున్నాడు. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేలా చేసింది. ఇదే సమయంలో కార్తీక్ ఆర్యన్ తల్లి ఈ మధ్య ఓ సందర్బంగా చిట్ చాట్ చేసింది. తనకు కోడలు కావాలని అనుకుంటున్నానని, ఆమె వైద్య వృత్తిని చేసినదై ఉండాలని తన మనసులో మాట బయట పెట్టింది. దీంతో డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన నటి శ్రీలీల కావడం తో తనేనా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
Also Read : Trivikram Srinivas Sensational :వినోదం అద్భుతం నవ్వించడం కష్టం