టాలీవుడ్ అనే సరికల్లా ప్రస్తుతం ఒకే ఒక్క పేరు ఎక్కువగా వినిపిస్తోంది. డాక్టర్ కోర్స్ చదువుతూనే మరో వైపు సినిమాలలో బిజీగా మారి పోయింది ముద్దుగుమ్మ శ్రీలీల. తను నట సింహంతో కలిసి నటించిన భగవంత్ కేసరి దుమ్ము రేపుతోంది. ఇప్పటికే రూ. 100 కోట్ల రూపాయలు కలెక్షన్లు కొల్లగొట్టింది.
చేతిలో మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. పంజా వైష్ణవ్ తేజ్ తో ఆది కేశవ చిత్రంతో పాటు నితిన్ రెడ్డితో కలిసి మరో మూవీ చేస్తోంది. అంతే కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారంలో ప్రిన్స్ మహేష్ బాబు సరనస మెరిసింది.
ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతోంది. ఇప్పటికే కేసరి సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇదే సమయంలో మాస్ మహరాజా రవితేజతో కలిసి నటించిన ధమాకా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత రిలీజ్ అయిన కేసరి కెవ్వు కేక అనిపించేలా చేసింది.
అంతకు ముందు రౌడీ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండతో కలిసి నటించాల్సి ఉంది. అయితే ఎంబీబీఎస్ పరీక్షలు ఉండడం, డేట్స్ కుదరక పోవడంతో తాను తప్పుకున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. దీంతో రష్మిక మందన్నా , శ్రీలీలకు బదులు సాక్షి వైద్య ను తీసుకున్నట్లు టాక్.