Squid Game Season 2: వరల్డ్ బెస్ట్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ రెండో సీజన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

వరల్డ్ బెస్ట్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' రెండో సీజన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Squid Game Season 2: ఓటీటీల్లో కొన్ని సినిమాలు లేదా వెబ్ సిరీసులు అనుహ్యంగా హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. పేరుకే ఇది కొరియన్ సిరీస్. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ లవర్స్‌ని మెప్పించింది. 2021లో రిలీజైన తొలి సీజన్ అద్భుతమైన రికార్డులు సెట్ చేయగా… ఇ‍ప్పుడు రెండో సీజన్ విడుదలకి సిద్ధమైంది. ఈ క్ర‌మంలో తాజాగా మేక‌ర్స్ ఈ సీజ‌న్‌ 2కు సంబంధించిన స్పెష‌ల్ టీజ‌ర్‌ ను రిలీజ్ చేయ‌డంతో పాటు సిరీస్ విడుద‌ల తేదీనీ కూడా ప్ర‌క‌టించారు. ది గేమ్ విల్ నాట్ స్టాప్ అంటూ రిలీజ్ చేసిన టీజ‌ర్ క్షణాల్లోనే మిలిమ‌న్ల కొద్ది వ్యూస్ ద‌క్కించుకుంటూ స‌రికొత్త రికార్టును క్రియేట్ చేస్తోంది. దాదాపు 3 సంవ‌త్స‌రాల త‌ర్వాత వ‌స్తున్న ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉండ‌గా డిసెంబ‌ర్ 26 నుంచి స్టీమింగ్ చేయ‌నున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది. టీజ‌ర్ విడుద‌ల చేసిన 10 గంట‌ల్లోనే 400K పైగా వ్యూస్ సాధించి ఈ సిరీస్ ప్ర‌త్యేక‌త ఏంటో నిరూపించింది.

Squid Game Season 2 Updates

నెట్‌ ఫ్లిక్స్ నిర్మించిన బెస్ట్ వెబ్ సిరీసుల్లో ‘స్క్విడ్ గేమ్(Squid Game)’ ఒకటి. చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కథ రాయడం విశేషం. డబ్బు అవసరమున్న 456 మందిని ఓ ద్వీపానికి తీసుకొచ్చి ఉంచుతారు. వీళ్ల మధ్య చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. పోటీల్లో గెలిచినోళ్లు తర్వాత దశకు వెళ్తుంటారు. మిగిలిన వాళ్లని నిర్వహకులు నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంటారు. చివరకు గెలిచిన ఒక్కరు ఎవరనేదే స్టోరీ.

తొలి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి రెండో సీజన్ మొదలవుతుంది. ఈసారి కూడా 456 మంది ఉంటారు. మళ్లీ వీళ్ల మధ్య కొత్త గేమ్స్ పెడతారు. మొద‌టి సీజ‌న్‌లో స్క్విడ్ గేమ్(Squid Game) గెలిచిన 456 నంబ‌ర్ ప్లేయ‌ర్ బ‌య‌టి దేశాల‌కు వెళ్లాల‌నుకున్న నిర్ణ‌యాన్ని మార్చుకుని 45.6బిల‌య‌న్ డాల‌ర్లు గెలవాల‌ని తిరిగి గేమ్‌ ఆడ‌డానికి రావ‌డంతో ఈ సిరీస్ ప్రారంభ‌మ‌వుతుంది. అయితే మొద‌టి సీజ‌న్‌ను మించి డిఫ‌రెంట్ రూల్స్‌తో, టాస్కుల‌తో, ట్విస్టుల‌తో ఓళ్లు గ‌గుర్పొడిచేలా ఈ సీజ‌న్‌ను రూపొందించారు. సీజ‌న్ 1లో న‌టించిన లీ జంగ్ జే, పార్క్ హే సూ, హోయాన్ జంగ్‌ల‌తో పాటు కొత్త‌గా యిమ్ సి-వాన్, కాంగ్ హా-న్యూల్, పార్క్ గ్యు-యంగ్, లీ జిన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మొద‌టి సిరీస్‌ను తెర‌కెక్కించిన హ్వాంగ్ డాంగ్-హ్యూక్ ఈ సెకండ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Also Read : Pranitha: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్ బ్యూటీ ప్రణీత !

netflixSquid GameSquid Game Season 2
Comments (0)
Add Comment