Spirit Movie : డార్లింగ్ ‘స్పిరిట్’ సినిమాలో మెగాస్టార్ – సందీప్ రెడ్డి

దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకురాబోతున్నారు డైరెక్టర్ సందీప్ వంగా...

Spirit : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి, బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాలతో రెండు ఇండస్ట్రీలను షేక్ చేశాడు. ఆ తర్వాత మరోసారి యానిమల్ తో ఆ రేంజ్ హిట్ అందుకున్నారు. యానిమల్ సినిమాతో దాంతో పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి భారీస్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ. 1000 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సెలబ్రెటీల నుంచి ‘యానిమల్’ మూవీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ అడియన్స్ మాత్రం ఈ మూవీ సూపర్ హిట్ చేశారు.

Spirit Movie Updates

దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకురాబోతున్నారు డైరెక్టర్ సందీప్ వంగా. సెకండ్ పార్ట్ టైటిల్ ‘యానిమల్ పార్క్’ అంటూ ముందే రివీల్ చేశారు. ఇక ఇందులోనూ రణబీర్, రష్మిక, త్రిప్తి, అనిల్ కపూర్ తోపాటు.. మరికొంత మంది బీటౌన్ నటులు కనిపించనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ స్టార్ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు సందీప్. ఇక ఈ సినిమాకు స్పిరిట్(Spirit) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి ముందే అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇప్పటికే చాలా రూమర్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. తాజాగా స్పిరిట్(Spirit) మూవీ గురించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో అలాగే ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సందీప్ రెడ్డి సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. అమితాబ్ ఈ మ్య కాలంలో సౌత్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇటీవలే కల్కి సినిమాలో అశ్వథామగా నటించారు బిగ్ బి. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న వెట్టయన్ సినిమాలోనూ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

Also Read : Nagarjuna : అక్కినేని నాగార్జున పిటిషన్ పై విచారణ షురూ చేసిన నాంపల్లి కోర్టు

CinemaMega Star ChiranjeeviSandeep Reddy VangaSpiritTrendingUpdatesViral
Comments (0)
Add Comment