South Directors Record : దక్షిణాదికి చెందిన నలుగురు దిగ్గజ డైరెక్టర్లు రికార్డు సృష్టించారు. తాము తీసిన సినిమాలతో ఏకంగా రూ. 600 కోట్ల క్లబ్ లోకి చేరారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన ప్రభాస్ తో తీసిన బాహుబళి, జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తేజతో కలిసి తీసిన రౌద్రం. రణం. రుధిరం (ఆర్ఆర్ఆర్) మూవీ దుమ్ము రేపింది. కోట్లు కురిపించింది. ఏకంగా అంతర్జాతీయంగా ఆస్కార్ అవార్డును సాధించింది.
South Directors Record Viral
చంద్రబోస్ రాసిన పాటకు పురస్కారం లభించింది. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆరు వందల కోట్లు సాధించిన చిత్ర దర్శకులలో నలుగురు నిలిచారు. వారిలో ఎస్ఎస్ రాజమౌళితో(SS Rajamouli) పాటు ఎస్. శంకర్ , ప్రశాంత్ నీల్ , నెల్సన్ దిలీప్ కుమార్ ఉన్నారు.
కర్ణాటక చిత్ర పరిశ్రమకు చెందిన క్రియేట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ఆయన యశ్ తో కలిసి తీసిన కేజీఎఫ్ కలెక్షన్ల పరంగా రికార్డు బ్రేక్ చేశారు. ఈ చిత్రం భారీ సక్సెస్ నిలిచింది. సీక్వెల్ కూడా తీశాడు ప్రశాంత్ నీల్. ఇదే సమయంలో రాజమౌళి కూడా బాహుబలిని సీక్వెల్ గా తీశాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ తీశాడు. త్వరలో అది విడుదలకు సిద్దంగా ఉంది.
ఇక నెల్సన్ దిలీప్ కుమార్ తమిళ సినీ రంగానికి చెందిన దర్శకుడు. ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ , తమన్నా భాటియాతో కలిసి జైలర్ చిత్రాన్ని తీశాడు. ఇది విడుదలైన నాటి నుంచి నేటి దాకా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదే సమయంలో శంకర్ కూడా చరిత్ర సృష్టించారు. మొత్తంగా దక్షిణాదికి చెందిన నలుగురు దర్శకులు చరిత్ర సృష్టించారు.
Also Read : Pragya Nagra Vs Shalini Pandey