Sourav Ganguly : న్యూఢిల్లీ – ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి తృటిలో ప్రమాదం తప్పింది. దుర్గాపూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఉన్నట్టుండి ముందుగా వెళుతున్న ఓ లారీ సడెన్ గా నిలిపి వేశారు.
Cricketer Sourav Ganguly…
దీంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న గంగూలీ(Sourav Ganguly) ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ తేరుకున్నాడు. వెంటనే సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో కారు లారీ వెనుక వైపు నుంచి వచ్చి నిలిచి పోయింది. దీంతో ఒక్కసారిగా గంగూలీ కుదుపునకు లోనయ్యాడు. ఒకవేళ కారు గనుక గుద్దుకుని ఉండి ఉంటే పెను ప్రమాదం చోటు చేసుకుని ఉండేది.
విషయం తెలిసిన వెంటనే హుటా హుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించారు. అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందా లేక దీని వెనుక ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడడంతో సౌరవ్ గంగూలీ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఇదిలా ఉండగా విషయం తెలిసిన వెంటనే క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆరా తీశారు. సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా గంగూలీ అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు.
Also Read : Ex MLA Gummadi Narsaiah Shocking : సీఎం నిర్వాకం గుమ్మడి నర్సయ్యకు అవమానం